కోనసీమగా మారనున్న కోనరావుపేట

ABN , First Publish Date - 2021-08-21T05:58:27+05:30 IST

కోనరావుపేట మండలం కోనసీమగా మారనుందని జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణారాఘవరెడ్డి, ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌బాబు అన్నారు.

కోనసీమగా మారనున్న కోనరావుపేట
రైతు వేదికను ప్రారంభిస్తున్న జడ్పీచైర్‌పర్సన్‌, కలెక్టర్‌, ఎమ్మెల్యే

- జడ్పీ చైర్‌పర్సన్‌ అరుణ, వేములవాడ ఎమ్మెల్యే రమేష్‌బాబు

కోనరావుపేట, ఆగస్టు 20: కోనరావుపేట మండలం కోనసీమగా మారనుందని జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణారాఘవరెడ్డి, ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌బాబు అన్నారు. మండలంలోని నిజామాబాద్‌ రైతు వేదికను కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌తో కలిసి ప్రారంభించి మండల కేంద్రంలో 150 లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కోన రావుపేట మూలవాగు జీవనదిగా మారబోతోందన్నారు. ప్రతీ గ్రామానికి రూ. 30 లక్షలు కేటాయించి అభివృద్ధి చేస్తామన్నారు. మల్కపేట రిజ ర్వాయర్‌ను కోనసీమను తల పించేలా మారబోతోందని అ న్నారు. మంత్రి కేటీఆర్‌ ప్రారం భించిన రైతు వేదికలోనే కల్యా ణలక్ష్మి చెక్కులు పంపిణీ చేయ డం సంతోషంగా ఉందన్నారు. త్వరలో ఎగ్లాస్‌పూర్‌ బ్రిడ్జిని పూర్తి చేస్తామని హామీ ఇచ్చా రు. మండలంలో 80 శాతం రహదారులు పూర్తి చేశామన్నా రు. 15 కోట్లతో అమ్మాయిలకు హాస్టల్‌ వసతి, అగ్రహారంలో జేఎన్‌టీయూ ఇంజనీరింగ్‌ కళాశాల ఏర్పాటు చేస్తామన్నారు. మల్కపేట రిజర్వా యర్‌లోకి మూడు మాసాల్లో ఒక టీఎంసీ నీరును నిం పుతామన్నారు. ఎంపీపీ చంద్రయ్యగౌడ్‌, సర్పంచ్‌లు అరుణ, రేఖ, ఆరె లత, వైస్‌ ఎంపీపీ వంగపల్లి సుమ లత, ఎంపీటీసీ చారి, సింగిల్‌విండో చైర్మన్‌లు బండ నర్సయ్య, రామ్మోహన్‌రావు, మాజీ సెస్‌ డైరెక్టర్‌ దేవర కొండ తిరుపతి, నాయకులు మంతెన సంతోష్‌, భూం రెడ్డి, రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-21T05:58:27+05:30 IST