ధర్మపురిలో కిడ్నాప్ కలకలం
ABN , First Publish Date - 2021-12-15T06:36:42+05:30 IST
ధర్మపురి పట్టణంలో ఒక యువతి కిడ్నాప్ మంగళవారం కల కలం సృష్టించింది.

తప్పించుకుని ఇంటికి చేరిన యువతి
ధర్మపురి, డిసెంబరు 14: ధర్మపురి పట్టణంలో ఒక యువతి కిడ్నాప్ మంగళవారం కల కలం సృష్టించింది. కిడ్నాప్ చేసిన కొద్ది సేపటికే యువతి తప్పించుకుని సురక్షితంగా బయట పడింది. విషయం తెలుసుకున్న పోలీసు లు కిడ్నాపర్లు ఉపయోగించిన కారు స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. బాధితురాలు, ధర్మపురి సీఐ బిళ్ల కోటేశ్వర్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక లక్ష్మీ నరసింహ కాలనీకి చెందిన యువతిని నలుగురు యువకులు కిడ్నాప్ చేసి ఏపీ 24 ఏఈ 2270 అనే నెంబర్ గల కారులో తీసుకెళ్లారు. కారు కమలాపూర్ వైపు వెళ్లే కెనాల్ రోడ్డు వద్ద ట్రబుల్ ఇవ్వడం తో ఆగి పోయింది. కిడ్నాపర్లు కారును మరమ్మతు చేస్తుండగా యువతి తప్పించుకుని ఇంటికి చేరుకుంది. యువతి వారి నుంచి తప్పించుకోవడంతో కిడ్నాపర్లు అక్కడి నుంచి పరార్ అయ్యారు. విషయం తెలుసుకున్న ధర్మపురి సీఐ కోటేశ్వర్ నేతృత్వంలో సిబ్బంది పూర్తి వివరాలు సేకరించారు. బాధితు రాలి ఫిర్యాదు మేరకు సారంగాపూర్ మండలంలోని రేచపల్లికి చెందిన మం గళారపు రాజేందర్ (23), మరో ముగ్గురు యువకులపై కేసు నమోదు చేశా రు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సీఐ తెలి పారు. ఇదిలా ఉండగా యువతికి ఈ నెల 13న వివాహం కుదిరి నిశ్చితార్థం కూడా జరిగింది.