28న కేడీసీ బ్యాంకు శతాబ్ది ఉత్సవాలు

ABN , First Publish Date - 2021-12-25T05:34:24+05:30 IST

కరీంనగర్‌లో 1921లో స్థాపించిన ది కరీంనగర్‌ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు శతాబ్ది ఉత్సవాలను ఈనెల 28న నగరంలోని పద్మనాయక కల్యాణ మండపంలో నిర్వహించనున్నట్లు నాఫ్స్కాబ్‌, రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంకు, కేడీసీసీబీ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు.

28న కేడీసీ బ్యాంకు శతాబ్ది ఉత్సవాలు

- మంత్రులు కేటీఆర్‌, నిరంజన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌ రాక 

- తొలిసారిగా నాఫ్స్కాబ్‌ పాలకవర్గ సమావేశం 


కరీంనగర్‌ టౌన్‌, డిసెంబరు 24: కరీంనగర్‌లో 1921లో స్థాపించిన ది కరీంనగర్‌ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు శతాబ్ది ఉత్సవాలను ఈనెల 28న నగరంలోని పద్మనాయక కల్యాణ మండపంలో నిర్వహించనున్నట్లు నాఫ్స్కాబ్‌, రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంకు, కేడీసీసీబీ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వేడుకలకు రాష్ట్ర వ్యవసాయ, సహకారశాఖ మంత్రి ఎస్‌ నిరంజన్‌రెడ్డి, రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కె తారకరామారావు, రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ ముఖ్యఅతిథులుగా హాజరవుతారని చెప్పారు. క్రిబ్‌కో చైర్మన్‌, ఇంటర్నేషనల్‌ కో ఆపరేటివ్‌ అలయన్స్‌ ఆసియా పసిఫిక్‌ అధ్యక్షుడు డాక్టర్‌ చంద్రపాల్‌, ఇఫ్ఫ్కో చైర్మన్‌ దిలీప్‌ సంఘాని, నాబార్డు చైర్మన్‌ చింతల గోవిందరాజులు, నాఫెడ్‌ చైర్మన్‌ డాక్టర్‌ బిజేందర్‌సింగ్‌, వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ సునీల్‌కుమార్‌సింగ్‌, ఎన్‌సిఎఆర్‌డీబీ చైర్మన్‌ శివదాస్‌ నాయర్‌ తదితరులు హాజరవుతారని చెప్పారు. ఈ సందర్భంగా డీసీసీబీ ప్రధాన కార్యాలయ ఆవరణలో శతాబ్ది ఉత్సవాల పైలాన్‌ను ఆవిష్కరించినట్లు సీఈవో తెలిపారు. కేడీసీసీబీ ప్రధాన కార్యాలయంలో ఈనెల 28న సాయంత్రం నాఫ్ప్కాబ్‌ పాలకవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 

Updated Date - 2021-12-25T05:34:24+05:30 IST