‘జై భీం’ అంటూ ప్రసంగాన్ని మొదలుపెట్టిన కేసీఆర్
ABN , First Publish Date - 2021-08-16T20:50:11+05:30 IST
హుజూరాబాద్లో దళిత బంధు ప్రారంభోత్సవ సభ నిర్వహించారు. సభలో ‘జై భీం’ అంటూ సీఎం కేసీఆర్ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు.
హుజూరాబాద్: హుజూరాబాద్లో దళిత బంధు ప్రారంభోత్సవ సభ నిర్వహించారు. సభలో ‘జై భీం’ అంటూ సీఎం కేసీఆర్ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. దళిత బంధుతో కొత్త చరిత్రను సృష్టిస్తామని చెప్పారు. ఈ పథకంతో ఎస్సీలకు ఎంతో మేలు కలుగుతుందని సీఎం తెలిపారు. దళిత బంధు ప్రభుత్వ కార్యక్రమం కాదు మహా ఉద్యమమని వ్యాఖ్యానించారు. ఈ ఉద్యమం విజయం సాధిస్తుందని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఏడాది కిందటే ఈ పథకాన్ని ప్రారంభించాలని అనుకున్నామని, అయితే కరోనా వల్ల ఆలస్యమైందని కేసీఆర్ పేర్కొన్నారు.