బీజేపీ నేతలు రెచ్చగొడుతున్నారు: Mlc palla
ABN , First Publish Date - 2021-10-25T17:18:29+05:30 IST
బీజేపీ నేతలు రెచ్చగొడుతున్నారని ఎమ్మెల్సీ పల్ల రాజేశ్వర్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు దిగుతున్నారని ఆరోపించారు.

కరీంనగర్: బీజేపీ నేతలు రెచ్చగొడుతున్నారని ఎమ్మెల్సీ పల్ల రాజేశ్వర్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. బీజేపీ తీరుపై ఎన్నికల కమిషన్కు, పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై దాడి చేసినట్లు తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారన్నారు. దుబ్బాక తరహా సంఘటనలు హుజురాబాద్లో జరిగే అవకాశం ఉందని చెప్పారు. ఈ నెల 27న రాజేందర్ లేదా ఆయన సతీమణి జమునా.. సొమ్మసిల్లి పడి ఆసుపత్రికి చేరే అవకాశం ఉందన్నారు. బీజేపీ నేతలు.. స్వీయ దాడులకు పాల్పడే అవకాశం ఉందని పల్లా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి పేర్కొన్నారు.