తండ్రికి అంత్యక్రియలు చేయని కుమార్తెలు.. మానవత్వం చాటిన 108 డ్రైవర్

ABN , First Publish Date - 2021-05-20T22:40:08+05:30 IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి సోకిన

తండ్రికి అంత్యక్రియలు చేయని కుమార్తెలు.. మానవత్వం చాటిన 108 డ్రైవర్

కరీంనగర్ జిల్లా : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి సోకిందని ఓ తండ్రి భయంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే.. ఆయన అంత్యక్రియలు నిర్వహించడానికి నలుగురు కుమార్తెలు, అల్లుళ్లు ఉన్నా ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు రాని పరిస్థితి. అంతేకాదు ఆయన బంధువులు కానీ ఆ గ్రామంలోని ఒక్కరూ కూడా ముందుకు రాలేదు. ఈ విషయం తెలుసుకున్న 108 డ్రైవర్, ఓ మెకానిక్ అంత్యక్రియలు చేశారు. ఈ దారుణ సంఘటన కరీంనగర్ జిల్లాలోని వీణవంక మండలం నర్సింగాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. 


మానవత్వం చాటారు!

పూర్తి వివరాల్లోకెళితే.. కరోనా సోకిందని తనకు ఏమవుతుందో ఏమో అని భయంతో ఇంగయ్య (70) అనే వృద్దుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు నలుగురు కుమార్తెలు ఉన్నారు. అంత్యక్రియలు నిర్వహించడానికి కాదు కదా.. కనీసం మృతదేహం దగ్గరకు కూడా కుమార్తెలు, బంధువులు ఎవరూ రాలేదు. ఇంగయ్య గురించి తెలుసుకున్న నర్సింగాపూర్ ప్రాంతానికి చెందిన 108 డ్రైవర్ శ్రీనివాస్, మెకానిక్ ఇమ్రాన్ పాష అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు. ఆ ఇద్దరి మంచి మనసును పలువురు మెచ్చుకుంటున్నారు. కాగా.. కరోనాతో చనిపోయిన.. మహమ్మారి సోకిందని భయంతో ఆత్మహత్య చేసుకున్న వారి అంత్యక్రియలు నిర్వహించడానికి కుటుంబ సభ్యులు ముందుకురాని సంఘటనలు తెలుగు రాష్ట్రాల్లో చాలానే చోటుచేసుకున్నాయి.

Updated Date - 2021-05-20T22:40:08+05:30 IST