నిరుపేద కుటుంబాలకు వరం కల్యాణలక్ష్మీ

ABN , First Publish Date - 2022-01-01T05:01:23+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న క ల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ వంటి పథకాలు నిరుపేదలకు వరంలాంటి వని జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత పేర్కొన్నారు.

నిరుపేద కుటుంబాలకు వరం కల్యాణలక్ష్మీ
చెక్కు పంపిణీ చేస్తున్న జడ్పీ చైర్‌పర్సన్‌ వసంత

జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ దావ వసంత

కథలాపూర్‌, డిసెంబరు 31 : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న క ల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ వంటి పథకాలు నిరుపేదలకు వరంలాంటి వని జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో 8 మందికి మంజూరైన రు.1,00,116ల చొప్పున చెక్కులను ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేశారు. అనంతరం చైర్‌పర్సన్‌ మాట్లాడారు. ప్రభుత్వం పేదల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తోందని అన్నా రు. అదేవిధంగా పోసానిపేట, గంభీర్‌పూర్‌ గ్రామాల్లో 7 చెక్కులను స్థా నిక నాయకులు పంపిణీ చేశారు. అనంతరం సిరికొండలో నూతనంగా నిర్మించిన మున్నూరు కాపు సంఘ భవన ప్రారంభోత్సవంలో పాల్గొన్నా రు. ఈ సందర్భంగా జడ్‌పీ వైస్‌ చైర్మన్‌ హరిచరణ్‌రావు, జడ్పీటీసీ  భూ మయ్య, ఎంపీపీ రేవతి, వైస్‌ ఎంపీపీ కిరణ్‌రావు, మండల టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు గంగప్రసాద్‌, ఏఎంసీ చైర్మన్‌ నాగేశ్వర్‌రావు, వైస్‌ చైర్మన్‌ లిం బాద్రి, కోఆప్షన్‌ సభ్యుడు రఫీ, సింగిల్‌ విండో చైర్మన్లు, వైస్‌ చైర్మన్లు, స ర్పంచులు, ఎంపీటీసీలు ఉన్నారు. 

Updated Date - 2022-01-01T05:01:23+05:30 IST