కాళేశ్వరం లింక్‌ 2 పనుల వద్ద ప్రమాదం..మట్టిపెల్లలు కూలి కార్మికుడి మృతి

ABN , First Publish Date - 2021-08-21T05:36:47+05:30 IST

కాళేశ్వరం ప్రా జెక్ట్‌ లింక్‌ 2 పనుల వద్ద మల్లిపె ల్లలు కూలి ఓ కార్మికుడు మృతి చెందిన సంఘటన పెగడపల్లి మం డలం దీకొండ గ్రామశివారులో చో టుచేసుకుంది.

కాళేశ్వరం లింక్‌ 2 పనుల వద్ద ప్రమాదం..మట్టిపెల్లలు కూలి కార్మికుడి మృతి
మృతి చెందిన సందీప్‌

పెగడపల్లి 20 : కాళేశ్వరం ప్రా జెక్ట్‌ లింక్‌ 2 పనుల వద్ద మల్లిపె ల్లలు కూలి ఓ కార్మికుడు మృతి చెందిన సంఘటన పెగడపల్లి మం డలం దీకొండ గ్రామశివారులో చో టుచేసుకుంది. స్థానికులు ఎస్సై అ శోక్‌ తెలిపిన వివరాల ప్రకారం ఉ త్తరప్రదేశ్‌లోని దేవరియా జిల్లా మల్పువాకు చెందిన సందీప్‌ (27) అనే యువకుడు కార్మికుడిగా పని చేస్తున్నాడు. సందీప్‌ పైపులకు వెల్డింగ్‌ చేస్తున్న క్రమంలో ఒక్క సారిగా పైనుంచి మట్టిపెల్లలు కలడంతో సందీప్‌ మట్టిదిబ్బల కింద కూరుకుపో యాడు. వెంటనే తోటి కార్మికులు క్రేన్‌ సహాయంతో మట్టిని తోడి వెలికి తీశారు. కొన ఊపిరితో ఉన్న సందీప్‌ను జగిత్యాల ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యలో మృతి చెందాడు. 

మల్యాల సీఐ రమణమూర్తి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. మృతుడికి భార్య, కూతురు, కు మారుడు ఉన్నట్లు తోటి కార్మికులు తెలిపారు.

Updated Date - 2021-08-21T05:36:47+05:30 IST