ఉద్యోగ ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలి

ABN , First Publish Date - 2021-08-03T06:27:27+05:30 IST

రాష్ట్రంలోని ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని యువజన కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు పడాల రాహుల్‌ డిమాండ్‌ చేశారు.

ఉద్యోగ ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలి
తెలంగాణ చౌక్‌ వద్ద ఫ్లకార్డులతో నిరసన తెలుపుతున్న కాంగ్రెస్‌ నాయకులు

కరీంనగర్‌ అర్బన్‌, ఆగస్టు2: రాష్ట్రంలోని ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని యువజన కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు పడాల రాహుల్‌ డిమాండ్‌ చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల వ్యవహరిస్తున్న వైఖ రిని నిరసిస్తూ యువజన కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో సోమవారం ఎన్టీఆర్‌ చౌక్‌లో ధర్నా నిర్వహించి సీఎం కేసీఆర్‌ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ సంద ర్భంగా రాహుల్‌ మాట్లాడుతూ  నిరు ద్యోగుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఇల్లందకుంట మండలానికి చెందిన మహ్మద్‌ షబీర్‌ బల వన్మరణానికి పాల్పడ్డాడన్నారు. మృతుడి కుటుంబానికి 50 లక్షలు ఎక్స్‌గ్రేషియాతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. ఈకార్యక్రమంలో యువజన కాంగ్రెస్‌ కరీంనగర్‌ అసెంబ్లీ అధ్యక్షుడు అబ్దుల్‌ రహమాన్‌, జిల్లా ప్రధానకార్యదర్శి కొండ హరి, నాయకులు ఖలీం, కృష్ణసాగర్‌, సందీప్‌, ప్రదీప్‌ తదితరులు పాల్గొన్నారు. 

కాంగ్రెస్‌ నాయకుల ఆందోళన

గణేశ్‌నగర్‌: మహ్మద్‌ షబ్బీర్‌ ఆత్మహత్యకు నిరసనగా జిల్లా కాంగ్రెస్‌ మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు ఎండీ తాజ్‌ ఆధ్వర్యంలో సోమవారం నగరంలోని తెలంగాణ చౌక్‌లో నోటికి నల్ల రిబ్బన్‌ కట్టుకొని నాయకులు నిరసన తెలిపారు. ఈసందర్భంగా నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడేళ్లయినా నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆగడం లేదన్నారు. షబ్బీర్‌ ఆత్మహత్యను ప్రభుత్వ హత్యగా పరిగణించి వారి కుటుం బాన్ని ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.కార్యక్రమంలో నాయకులు రహమత్‌ హుస్సేన్‌, సమద్‌ నవాబ్‌, ఉప్పరి రవి, పులి ఆంజనేయులు గౌడ్‌ పాల్గొన్నారు. 

ఫశంకరపట్నం: రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ బంధు పథకాన్ని ప్రవేశపెట్టి యువత ఆత్మహత్యలు ఆపాలని యూత్‌ కాంగ్రెస్‌ మానకొండూన్‌ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి హిసమోద్దీన్‌ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షబ్బీర్‌ అనే నిరుద్యోగి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. ఈకార్యక్రమంలో నాయకులు అనిల్‌, శ్రీనివాస్‌, షారుఖ్‌, ప్రవీణ్‌, మణిదీప్‌, బిక్షపతి, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-03T06:27:27+05:30 IST