ఉచిత వ్యాక్సిన్‌పై జీవో విడుదల చేయకపోవడం విచారకరం

ABN , First Publish Date - 2021-06-22T06:12:25+05:30 IST

ఈ నెల 21 నుంచి 18 ఏళ్లు నిండిన వా రందరికీ ఉచిత వ్యాక్సిన్‌ వేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయంపై రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయకపోవడం విచారకరమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణరావు అన్నారు.

ఉచిత వ్యాక్సిన్‌పై జీవో విడుదల చేయకపోవడం విచారకరం
వ్యాక్సిన్‌ కేంద్రాన్ని పరిశీలిస్తున్న సత్యనారాయణ రావు

బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ రావు 

జగిత్యాల అర్బన్‌, జూన్‌ 21: ఈ నెల 21 నుంచి 18 ఏళ్లు నిండిన వా రందరికీ ఉచిత వ్యాక్సిన్‌ వేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయంపై రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయకపోవడం విచారకరమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణరావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పలు వ్యాక్సినేషన్‌ సెంటర్లను బీజేపీ నాయకులతో కలిసి ప రిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రకటనను రాష్ట్ర ప్రభుత్వం నీరుగార్చే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. రాష్ట్ర ప్ర భుత్వం ఇప్పటికైనా స్పందించి 18 ఏళ్లు నిండిన వారందరికీ టీకా వే సేలా జీవోను జారీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఆయన వెంట బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు గుడాల రాజేష్‌, పట్టణ అధ్యక్షుడు వీరబత్తిని అనిల్‌, బీజేవైయం జిల్లా అధ్యక్షుడు రెంటం జగదీష్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-22T06:12:25+05:30 IST