ఈటలను మంత్రి పదవి నుంచి తప్పించడం అన్యాయం

ABN , First Publish Date - 2021-05-02T05:30:00+05:30 IST

ఎస్సీ, ఎస్టీలతో పాటు బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషిచేస్తున్న ఈటెల రాజేందర్‌ను మంత్రి పదవి నుంచి తప్పించడం అన్యాయమని మహాత్మా జ్యోతిబాఫూలే ఆశయ సాధన సమితిలోని తొమ్మిది బీసీ సంఘాలు తీవ్రంగా ఖండించాయి.

ఈటలను మంత్రి పదవి నుంచి తప్పించడం అన్యాయం
మాట్లాడుతున్న మహాత్మా జ్యోతిబాఫూలే ఆశయ సాధన సమితి నాయకులు

కరీంనగర్‌ టౌన్‌, మే2: ఎస్సీ, ఎస్టీలతో పాటు బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషిచేస్తున్న ఈటెల రాజేందర్‌ను మంత్రి పదవి నుంచి తప్పించడం అన్యాయమని మహాత్మా జ్యోతిబాఫూలే ఆశయ సాధన సమితిలోని తొమ్మిది బీసీ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఆదివారం నగరంలో వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో 14 సంవత్సరాల పాటు పోరాడిన   యోధుడు ఈటల రాజేందర్‌ అని ప్రశంసించారు. అలాంటి రాజేందర్‌ను అసైన్డ్‌ భూములు ఆక్రమించారనే ఆరోపణలతో విచారణ పూర్తిగా జరపక ముందే  మంత్రి పదవి నుంచి తప్పించడం విచారకరమన్నారు. ఈ సమావేశంలో నాయకులు బండారి భూమేశ్‌, పోలు లక్ష్మన్‌, మీస బీరయ్య, జె.నర్సయ్య, రవీందర్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. 

‘ఈటలపై కేసీఆర్‌ కుటుంబం కుట్ర’

ఫహుజూరాబాద్‌: ఈటల రాజేందర్‌ భూకబ్జా ఆరోపణలపై కేసీఆర్‌ కుటుంబం కుట్ర ఉందని తెలంగాణ జనసమితి రాష్ట్ర కార్యదర్శి ముక్కెర రాజు అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రశ్నిస్తే కక్ష సాధింపు కేసీఆర్‌ నైజమన్నారు. ఈటలపై విచారణకు ఆదేశించడంపై ఎలాంటి అభ్యంతరం లేదని, అంతకు ముందు భూములు కబ్జా చేసిన మంత్రులు మల్లారెడ్డి, మహేందర్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌, కేటీఆర్‌లపై చర్యలు ఎందుకు తీసుకోలేదన్నారు. నయీం ఎన్‌కౌంటర్‌లో బయటపడిన వేల కోట్ల రూపాయల బంగారం, భూములపై విచారణ ఏమైందని ఆయన ప్రశ్నించారు. 

-ఈటల మచ్చలేని నాయకుడని, ఆయనపై వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుడు సందమల్ల బాబు, మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర కోర్‌ కమిటీ సభ్యుడు తునికి వసంత్‌ మాదిగ, బీసీ సంక్షేమ సంఘం మండలాధ్యక్షుడు రావుల అశోక్‌, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ జక్కని సంజయ్‌కుమార్‌, తెలంగాణ అంబేద్కర్‌ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు తునికి సమ్మయ్య, వాసాల శ్రీనివాస్‌లు సంయుక్త ప్రకటనలో అన్నారు. హుజూరాబాద్‌ పట్టణంలోని డీసీఎంఎస్‌ కాంప్లెక్స్‌లో దుకాణదారులు ఈటల చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. 

జమ్మికుంట రూరల్‌: ఈటల రాజేందర్‌ను మంత్రి పదవి నుంచి భర్తరఫ్‌ చేయడాన్ని నిరసిస్తూ  ఆదివారం గాంధీ చౌరస్తాలో ముస్లింలు నల్ల రిబ్బె న్లు చేతికి కట్టుకొని నిరసన తెలిపారు.  ఈకార్యక్రమంలో జాకీర్‌, హుస్సేన్‌, మౌలానా, నజీర్‌, అబ్ధుల్‌, రహమాన్‌, సాదీక్‌, షకీల్‌, హైమద్‌ పాల్గొన్నారు. 

వీణవంక: ఈటల రాజేందర్‌ మచ్చలేని నాయకుడని, కావాలనే నిందారోపణలు చేస్తున్నారని మండల టీఆర్‌ఎస్‌ నాయకులు అన్నారు. ఆదివారం విలేకరుల సమావేశంలో టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు మారముల్ల కొంరయ్య, మాజీ సింగిల్‌ విండో చైర్మన్‌ మాడ సాధవరెడ్డిలు మాట్లాడుతూ ఉద్యమ సమయం నుంచి తెలంగాణ రాష్ట్ర సాధనలో ఈటల రాజేందర్‌ పార్టీ కోసం తన ఆస్తులను అమ్ముకున్నారని వారు పేర్కొన్నారు. 

ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు కొత్తిరెడ్డి కాంతారెడ్డి, ఎనగంటి విజయ-శ్రీనివాస్‌, పొదిల జ్యోతి-రమేష్‌, మోరె సారయ్య, బండ సుజాత-కిషన్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ రాయిశెట్టి లత-శ్రీనివాస్‌, ఎంపీటీసీలు మోరె స్వామి, మూల రజిత-పుల్లారెడ్డి, సవిత-మల్లయ్య, నాయకులు పాల్గొన్నారు.

చిగురుమామిడి: బీసీలు రాజకీయంగా ఎదగ డాన్ని ముఖ్యమంత్రి  కేసీఆర్‌  ఓర్వ లేక పోతున్నారని కాంగ్రెస్‌ పార్టీ మండల బీసీ సెల్‌ అధ్యక్షుడు కోణేటి రాములు అన్నారు. రాష్ట్రంలో దొరల పాలన సాగుతోందన్నారు.  ఈ సమావేశంలో రాజు, సమ్మయ్య, అనిల్‌, శ్యామ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-02T05:30:00+05:30 IST