ఇంటర్మీడియట్‌ బోర్డు దిష్టిబొమ్మ దహనం

ABN , First Publish Date - 2021-12-19T05:52:21+05:30 IST

ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యం లో శనివారం గోదావరి ఖని మార్కండేయకాలనీ చౌరస్తాలో ఇంటర్మీడియ ట్‌ బోర్డు దిష్టిబొమ్మను దహనం చేశారు.

ఇంటర్మీడియట్‌ బోర్డు దిష్టిబొమ్మ దహనం
దిష్టిబొమ్మను దహనం చేస్తున్న ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు

కోల్‌సిటీటౌన్‌,డిసెంబర్‌ 18: ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యం లో శనివారం గోదావరి ఖని మార్కండేయకాలనీ చౌరస్తాలో ఇంటర్మీడియ ట్‌ బోర్డు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇంటర్మీ డియట్‌ బోర్డు ఇష్టానుసా రంగా వ్యవహరించడం వల్లనే ఇద్దరు విద్యార్థులు మరణించారని ఆరోపిం చారు. ఈ సందర్భంగా సంఘం రామగుండం కార్పొరేషన్‌ అధ్యక్ష, కార్య దర్శులు రేణుకుంట్ల ప్రీ తం, ఈర్ల రాంచందర్‌ మాట్లాడుతూ కరో నా సమయంలో పాఠాలు సరిగ్గా చెప్పకుం డా ఆన్‌లైన్‌ తరగతులు సక్రమంగా నిర్వ హించకుండా, ఇష్టానుసారంగా బోర్డు వ్యవహరించడం వల్లనే ఇద్దరు విద్యార్థులు మరణించడం జరిగిందని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం ఇంటర్‌ మొద టి సంవత్సరం పరీక్షలు కరోనా సమయంలో నిర్వహించం అని, విద్యార్థులను పైతరగ తికి ప్రమోట్‌ చేస్తున్నట్టు చెప్పి మళ్ళీ పరీ క్షలు నిర్వహించి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందన్నారు. అక్టోబర్‌ 25 నుంచి నవంబర్‌ 3వరకు నిర్వహించిన ఇంటర్‌ ఫస్ట్‌ఇయర్‌ పరీక్షల్లో మొత్తం 4, 59,242 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 2,24,012 మంది(49శాతం) ఉత్తీర్ణులయ్యా రంటే విద్యార్థులకు విద్యా బోధన ఎంత వరకు జరి గిందో స్పష్టంగా కనిపి స్తోందన్నారు. కరోనా స మయంలో పాఠాలు సరి గా చెప్పకుండా ఆన్‌లైన్‌ తరగతులు సక్రమంగా నిర్వహించకుండా ఒంటె ద్దుపోకడలతో నిర్ణయాలు తీసుకోవడం వల్ల విద్యా ర్థులు ఆత్మహత్యలకు పా ల్పడుతున్నారని అన్నారు. గతంలో కూడా ఇంటర్మీ డియట్‌ బోర్డు తప్పిదం వల్లే ఎంతో మంది విద్యా ర్థులు మరణించడం జరిగిందని, అందుకు ప్రభుత్వమే కారణమన్నారు. ఇక నుంచి విద్యార్థులు ఆత్మస్థైర్యం కోల్పోయి ఆత్మహ త్యలు చేసుకోవద్దని పోరాడి సమస్యలను పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గాజుల వంశీ, వివేక్‌, టోని, రాజ్‌కుమార్‌, హర్షిత్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-19T05:52:21+05:30 IST