అంధుడి వినూత్న నిరసన

ABN , First Publish Date - 2021-08-10T05:54:14+05:30 IST

మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట ఓ అంధుడు సోమవారం డప్పు వాయిస్తూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశాడు.

అంధుడి వినూత్న నిరసన
డప్పు వాయిస్తూ నిరసన తెలుపుతున్న వీరయ్య

శంకరపట్నం, ఆగస్టు 9: మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట ఓ అంధుడు సోమవారం డప్పు వాయిస్తూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశాడు.  మండలంలోని కన్నాపూర్‌ గ్రామానికి చెందిన అంధుడు దేవునూరి వీరయ్య మాట్లాడుతూ ప్రభుత్వం వికలాంగుల సంక్షేమం కోసం, వారి ఆర్థిక ఎదుగుదల కోసం పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. తనకు రెండు కళ్లు కనబడవని, బ్యాంకు రుణం కోసం దరఖాస్తు చేసుకొని బ్యాంకు అధికారుల ఆమోద పత్రాన్ని కరీంనగర్‌లోని వికలాంగుల సంక్షేమ శాఖాధికారికి 2017 డిసెంబరులో అందజేశానన్నారు. అప్పటి నుంచి తనకు రుణం ఇవ్వలేదన్నారు. లాక్‌డౌన్‌ తరువాత వికలాంగుల సంక్షేమశాఖాధికారి జిల్లా ఏడీ, సూపరింటెండెంట్‌ వద్దకు సమాచారం కోసం వెళ్తే తనను అంధుడు అని చూడకుండా కార్యాలయం నుంచి బయటకు పంపించారన్నారు. జిల్లా స్థాయి అధికారుల వైఖరికి నిరసనగా శంకరపట్నం మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట బ్యానర్‌ కట్టి, డప్పు వాయిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - 2021-08-10T05:54:14+05:30 IST