ముగిసిన నిరసన దీక్ష

ABN , First Publish Date - 2021-12-30T05:47:35+05:30 IST

వస్త్ర పరిశ్రమపై పెంచిన జీఎస్టీని ఉపసంహరించుకోవాలని చేపట్టిన మూడు రోజుల నిరసన దీక్ష బుధవారం ముగిసింది. వస్త్రపరిశ్రమపై ఉన్న 5 శాతం ఉన్న జీఎస్టీని 12 శాతానికి పెంచుతుండడంతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సిరిసిల్ల గాంధీ చౌక్‌ వద్ద వస్త్రోత్పత్తి దారులు ఈ నెల 27వ తేదీన నిరసన దీక్ష చేపట్టారు.

ముగిసిన నిరసన దీక్ష
సిరిసిల్ల గాంధీ చౌక్‌ వద్ద వస్త్ర పారిశ్రామికుల నిరసన దీక్ష

- జీఎస్టీ రద్దుకు వస్త్ర పారిశ్రామికుల డిమాండ్‌ 

సిరిసిల్ల, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): వస్త్ర పరిశ్రమపై పెంచిన జీఎస్టీని ఉపసంహరించుకోవాలని చేపట్టిన మూడు రోజుల నిరసన దీక్ష బుధవారం ముగిసింది.  వస్త్రపరిశ్రమపై ఉన్న  5 శాతం ఉన్న జీఎస్టీని   12 శాతానికి పెంచుతుండడంతో  సిరిసిల్ల వస్త్ర పరిశ్రమల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సిరిసిల్ల గాంధీ చౌక్‌ వద్ద వస్త్రోత్పత్తి దారులు ఈ నెల 27వ తేదీన నిరసన దీక్ష చేపట్టారు.  ఈ సందర్భంగా పారిశ్రామికులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వస్త్ర పరిశ్రమపై జీఎస్టీని తొలగించాని కోరారు. జీఎస్టీ పెంపుతో సిరిసిల్ల మరమగ్గాల పరిశ్రమ సంక్షోభంలో పడుతుందని, కార్మికులకు ఉపాధికి నష్టం వాటిల్లుంతుందని అన్నారు. చేనేత మగ్గాలు పూర్తిగా దెబ్బతింటాయన్నారు.  చివరిరోజు దీక్షల్లో సిరిసిల్ల టెక్స్‌టైల్‌ పార్కు అసోసియేషన్‌ ప్రతినిధులు వాసం శ్రీనివాస్‌, అంకారపు కిరణ్‌, దుబాల మొండయ్య, సిరిసిల్ల తిరుపతి, బూట్ల శ్రీనివాస్‌, కట్టెకోల శివ, ఆడెపు శ్రీహరి, గాజుల శరత్‌, గర్దాస్‌ కృష్ణహరి, బొద్దుల శ్రీనివాస్‌, వేముల శ్రీనివాస్‌, కాటన్‌ ఉత్సత్తిదారుల సంఘం ప్రతినిధులు పోలు రాజయ్య, కొక్కుల వెంకటేశం దీక్షలో కూర్చున్నారు. దీక్షలకు కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ కార్మిక విభాగం అధ్యక్షుడు వెంగళ శ్రీనివాస్‌, సూర దేవరాజు, కమలాకర్‌, బాలరాజు, కట్టెకోల లక్ష్మీనారాయణ సంఘీభావం తెలిపారు.

Updated Date - 2021-12-30T05:47:35+05:30 IST