పాఠశాలల్లో మౌళిక వసతులను ఏర్పాటు చేయాలి

ABN , First Publish Date - 2021-08-27T06:16:32+05:30 IST

సెప్టెంబరు 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం కానున్న దృష్ట్యా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సరిపడా మౌ లిక వసతులను యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేయాలని జడ్పీ చైర్‌పర్స న్‌ దావ వసంతసురేష్‌ ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు.

పాఠశాలల్లో మౌళిక వసతులను ఏర్పాటు చేయాలి
వెల్గటూర్‌లో తరగతి గదిని పరిశీలిస్తున్న జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత

-జడ్పీ చైర్‌ పర్సన్‌ దావ వసంతసురేష్‌

గొల్లపల్లి, ఆగస్టు 26 : సెప్టెంబరు 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం కానున్న దృష్ట్యా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సరిపడా మౌ లిక వసతులను యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేయాలని జడ్పీ చైర్‌పర్స న్‌ దావ వసంతసురేష్‌ ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. గురువా రం గొల్లపల్లి ఆదర్శ పాఠశాలను, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను, క స్తూర్భా గాంధీ బాలికల ఆశ్రమ పాఠశాలలను జడ్పీ చైర్‌ పర్సన్‌ ఆకస్మి కంగా తనీఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా విద్యా సంస్థల ఆవరణల్లో పారిశుధ్యం, మౌలిక వసతులను స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారుల తో కలిసి పరిశీలించారు. పాఠశాలల్లో పరిసరాలను పరిశుభ్రం చేయాల ని, శానిటైజ్‌ చేయించాలని, విద్యార్థులకు ఏలాంటి ఇబ్బందులు కల్గకుం డా తగు జాగ్రత్తలు చేపట్టాలన్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఆదేశాల మేరకు పాఠశాలల్లో వసతులను పరిశీలించినట్లు జడ్పీ చైర్‌ పర్సన్‌ పే ర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ జలేంధర్‌, ఎంపీపీ శంకరయ్య, ఏఎంసీ చైర్మన్‌ లింగారెడ్డి, వైస్‌ చైర్మన్‌ గంగాధర్‌, టీఆర్‌ఎస్‌ మండల శా ఖ అధ్యక్షుడు రమేష్‌, ఎంపీడీవో జనార్ధన్‌, ఎంఈవో జమునా దేవి, ఆద ర్శ పాఠశాల ప్రిన్సిపాల్‌ రాజ్‌కుమార్‌, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యా యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

పాఠశాలల పరిశుభ్రతపై చర్యలు చేపట్టాలి

వెల్గటూర్‌ : పాఠశాలలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలని జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత ఆదేశించారు. గురువారం మండలంలోని వెల్గటూర్‌, ఎండపెల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలను సందర్శించి పారిశుధ్య పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ అన్ని పాఠశాలల్లో నీటి ట్యాంకులు, మరుగుదొడ్లు, తరగతి గదులను శుభ్రపరిచి శానిటేషన్‌ చేయించాలని సూచించారు. ఎండపెల్లిలో అదనపు తరగతి గదులు, ప్రహరీ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని స ర్పంచ్‌ జలంధర్‌రెడి,్డ ఎస్‌ఎంసీ చైర్మన్‌ శంకరయ్య, ఉపాధ్యాయులు కోరు తూ వినతిపత్రం అందజేశారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్క లు నాటారు. మహిళ సమానత్వ దినోత్సవం సందర్భంగా ఆమెను సన్మా నించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సంజీవ్‌రావు, ఎంఈవో భూమ య్య, జడ్పీటీసీ సుధా రామస్వామి, ఏఎంసీ చైర్మన్‌ ఏలేటి కృష్ణారెడ్డి, సిం గిల్‌ విండో చైర్మన్‌ గూడ రాంరెడ్డి, సర్పంచ్‌లు మురళి, జలంధర్‌ రెడ్డి, నా యకులు లింగయ్య, గండ జగదీశ్వర్‌, సందీప్‌రెడ్డి, కార్యదర్శులు రాజేం ధర్‌, తిరుపతి పాల్గొన్నారు.

Updated Date - 2021-08-27T06:16:32+05:30 IST