పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి

ABN , First Publish Date - 2021-08-27T06:04:56+05:30 IST

సెప్టెంబరు 1 నుంచి పాఠశాలలను పునఃప్రారం భించాలని ప్రభుత్వం నిర్ణయించి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అన్ని పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని పెద్దపల్లి జడ్పీ సీఈవో ఎం శ్రీనివాస్‌ హెచ్‌ఎంలకు సూచించారు.

పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి
ధర్మారంలో మాట్లాడుతున్న జడ్పీ సీఈవో శ్రీనివాస్‌

- జిల్లా పరిషత్‌ సీఈవో శ్రీనివాస్‌

ధర్మారం, ఆగస్టు 26: సెప్టెంబరు 1 నుంచి పాఠశాలలను పునఃప్రారం భించాలని ప్రభుత్వం నిర్ణయించి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అన్ని పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని పెద్దపల్లి జడ్పీ సీఈవో ఎం శ్రీనివాస్‌ హెచ్‌ఎంలకు సూచించారు. గురువారం మండల పరిషత్‌ కా ర్యాలయంలో పాఠశాలల పునఃప్రారంభంపై సమీక్ష సమావేశం నిర్వహిం చారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, గురుకుల విద్యాలయాల్లో విద్యార్థుల కు ఇబ్బందులు కలుగకుండ అన్ని వసతులు కల్పించాలని చెప్పారు. ప్రతి పాఠశాల ఆవరణలో పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. అంతేకాకుండ తరగతి గదుల్లో శానిటైజ్‌ చేయించాలని ఆయన పేర్కొన్నారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో ఎంపీడీవో జయశీల, ఎంఈవో ఛా యాదేవి, ప్రధానోపాద్యాయలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-27T06:04:56+05:30 IST