ఎల్‌ఎండీలోకి 12,600 క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో

ABN , First Publish Date - 2021-06-21T05:37:18+05:30 IST

కరీంనగర్‌ పరిధిలోని దిగువ మానేరు జలాశయంలోకి శ్రీ రాజరాజేశ్వర జలాశయం నుంచి ఇన్‌ఫ్లో కొనసాగుతోంది.

ఎల్‌ఎండీలోకి 12,600 క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో
ఎల్‌ఎండీలో ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలు

 తిమ్మాపూర్‌, జూన్‌ 20: కరీంనగర్‌ పరిధిలోని దిగువ మానేరు జలాశయంలోకి శ్రీ రాజరాజేశ్వర జలాశయం నుంచి ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. శనివారం 9,450 క్యూసెక్కుల నీరు ఎల్‌ఎండిలోకి రాగా ఆదివారం సాయంత్రానికి 12,600 క్యూసెక్కులకు పెరిగిందని ఇరిగేషన్‌ అఽధికారులు తెలిపారు. దీంతో ఎల్‌ఎండీ నీటి మట్టం రోజురోజుకూ పెరుగుతోంది. ఎల్‌ఎండీ పూర్తి స్దాయి నీటి మట్టం 24.034 టీఎంసీలు కాగా ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు 12.193 టీఎంసీలకు చేరుకుందని అధికారులు వెల్లడించారు.

Updated Date - 2021-06-21T05:37:18+05:30 IST