ఉప్పొంగిన మానేరు వాగు

ABN , First Publish Date - 2021-07-24T06:21:08+05:30 IST

మూడురోజులుగా కురుస్తున్న వర్షాలకు మం డలంలోని మానేరు పరివాహక ప్రాంత గ్రామాల్లో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.

ఉప్పొంగిన మానేరు వాగు
నీరుకుళ్ల వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న మానేరు వాగు

- నీటమునిగిన చెక్‌డ్యాం, రంగనాయకుల గుడి

- వందలాది ఎకరాల్లో పంట నష్టం

సుల్తానాబాద్‌, జూలై23: మూడురోజులుగా కురుస్తున్న వర్షాలకు మం డలంలోని మానేరు పరివాహక ప్రాంత గ్రామాల్లో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నీరుకుల్ల మానేరు వాగు ఒడ్డున ఉన్న రంగనాయకుల స్వామి ఆలయం నీటమునిగింది. ఆలయానికి వచ్చే దారిలో నీటి ప్రవా హం ఎక్కువ కావడంతో రాకపోకలు నిలిచాయి.వాగులో నిర్మాణంలో ఉన్న చెక్‌డ్యాం నీట మునిగిపోయింది. నీరుకుళ్ల వైపు నిర్మాణం పూర్తి కాగా అవ తల వేగురపల్లి వైపు ఇంకా పనులు ప్రారంభించాల్సి ఉంది. ఈ నేపథ్యం లో చెక్‌డ్యాం మునిగిపోవడంతో గుత్తేదారులు ఆరా తీస్తున్నారు. వారి ఇం జనీరింగ్‌ విభాగం అధికారులు శుక్రవారం మునిగిన డ్యాంను పరిశీలించా రు. దాదాపు వంద ఎకరాలకుపైగా పొలం మడులలో వరద నీరు చేరింది. మానేరు వాగులో నీటి ప్రవాహం ఉధృతి మూలంగా గొల్లపల్లి, నీరుకుళ్ల, గట్టేపల్లి, కదంబాపూర్‌, మంచరామి, కనుకుల గ్రామాలకు చెందిన రక్షిత మంచినీటి సరఫరా పథకాలకు సంబంధించిన పైపులైన్లు, మోటార్లు నీట మునిగాయి. నీటిసరఫరాకు ఇబ్బందులు తప్పేలా లేవు. మండలంలోని చె రువులు, కుంటలు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. వరదనీరు రోడ్లపై ప్ర వహిస్తుండడంతో మత్సకారులు,ఇతరులు చేపలు పట్టే ప్రయత్నం చేశారు. వర్షాలకు నీట మునిగిన పంటలను శుక్రవారం వ్యవసాయాధికారులు పరి శీలించారు. మండల వ్యవసాయాదికారి డేవిడ్‌ రాజు, విస్తీర్ణాదికారి ప్రశాం త్‌ తదితరులు తొగర్రాయి తదితర గ్రామాల్లో పర్యటించి పంట నష్టాలను నమోదు చేసుకున్నారు.  

Updated Date - 2021-07-24T06:21:08+05:30 IST