పెరిగిన ఎల్‌ఎండీ నీటిమట్టం

ABN , First Publish Date - 2021-09-03T05:12:51+05:30 IST

కరీంనగర్‌ పరిఽధిలోని దిగువ మానేరు జలాశయంలోకి ఇన్‌ఫ్లో కొనసాగుతోంది.

పెరిగిన ఎల్‌ఎండీ నీటిమట్టం
నిండు కుండాల కనబడుతున్న మోయతుమ్మెద వాగు

ఆరు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల 

తిమ్మాపూర్‌, సెప్టెంబరు 2: కరీంనగర్‌ పరిఽధిలోని దిగువ మానేరు జలాశయంలోకి  ఇన్‌ఫ్లో కొనసాగుతోంది.  గురువారం ఉదయం నీటిమట్టం 23.214 టీఎంసిలకు చేరడంతో ఇరిగేషన్‌ అధికారులు ఆరు గేట్లను ఫీట్‌ మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. గురువారం సాయంత్రం ఆరు గంటల సమయం వరకు 13,629 క్యూసెక్కుల నీరు ఎల్‌ఎండిలోకి వస్తోంది. ఎగువన మోయతుమ్మెద వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఇన్‌ఫ్లో నిలకడగా కొనసాగుతోంది. ఎల్‌ఎండీ నీటి మట్టం 23.344 టీఎంసీలకు చేరుకుంది. ఆరు గేట్ల ద్వారా 11,820 క్యూసెక్కులు, కాకతీయ కాలువ ద్వారా 1500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

Updated Date - 2021-09-03T05:12:51+05:30 IST