పెరిగిన కరువు భత్యం చెల్లించాలి
ABN , First Publish Date - 2021-05-09T04:49:13+05:30 IST
పెరిగిన కరువు భత్యం వెంటనె చెల్లించాలని తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూ నియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మోర అజయ్ డిమాండ్ చేశారు. శనివారం సీఐటీయూ జిల్లా కార్యాలయంలో బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు గోవిందు లక్ష్మణ్ అధ్యక్షతన యూనియన్ జిల్లా ముఖ్యనాయల సమావేశం నిర్వహించారు.

సిరిసిల్ల టౌన్, మే 8: పెరిగిన కరువు భత్యం వెంటనె చెల్లించాలని తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూ నియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మోర అజయ్ డిమాండ్ చేశారు. శనివారం సీఐటీయూ జిల్లా కార్యాలయంలో బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు గోవిందు లక్ష్మణ్ అధ్యక్షతన యూనియన్ జిల్లా ముఖ్యనాయల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అజయ్ మాట్లాడుతూ బీడీ పరిశ్రమంలో పని చేస్తున్న అన్ని కేటగిరి కార్మికులకు కరవు భత్యం పెరుగుదల 1444 పాయింట్ల నుంచి 1548 పాయింట్లకు పది పైసలు చొప్పున 10 రూపాయాల 40 పైసలు పెరిగిం దన్నారు. కరువుభత్యం మొత్తం కూలీతో కలుపుకొని 1000 బీడీలకు 211 రూపా యల 52పైసలు ఇవ్వాలన్నారు. ఈ వేత నాలు ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాల్సి ఉండగా ఇప్పటికీ ఇవ్వకపోవడం దుర్మా ర్గం అన్నారు. స్థానిక లేబర్ ఆఫీసర్ దీనిపై చొరవ చూపాలన్నారు. పట్టణంలో కరోనా బారిన పడి కార్మికులు ఇబ్బంది పడుతు న్నారని, వారిని ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. అర్హులైన కార్మికులకు ప్రభుత్వం వెంటనే డబుల్ బెడ్‌రూంలు కేటా యించాలని, లేని పక్షంలో యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామన్నారు. యూనియన్ జిల్లా కమిటీ సభ్యులు సూరం పద్మ, సామల కవిత, దాసరి రూప, శ్రీరాము కవిత, ఐలయ్య, సామల వినయ్ పాల్గొన్నారు.