జిల్లాలో పెరిగిన నేరాలు

ABN , First Publish Date - 2021-12-31T05:02:42+05:30 IST

జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 5759 కేసులు నమోదు కాగా, గత ఏడాదితో పోల్చి చూస్తే 456 కేసులు ఎక్కువగా నమోదయ్యాయి.

జిల్లాలో పెరిగిన నేరాలు
సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ

ఈ ఏడాది 5,759 కేసుల నమోదు

వార్షిక నివేదికను వెల్లడించిన ఎస్పీ సింధుశర్మ

జగిత్యాల టౌన్‌, డిసెంబరు 30 :జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 5759 కేసులు నమోదు కాగా, గత ఏడాదితో పోల్చి చూస్తే 456 కేసులు ఎక్కువగా నమోదయ్యాయి.గురువారం జిల్లా కేంద్రంలోని ట్రాఫి క్‌ శిక్షణ కేంద్రంలో జిల్లా ఎస్పీ సింధు శర్మ విలేకరుల సమావేశం నిర్వ హించి 2021 సంవత్సరంలో జరిగిన నేరాల వార్షిక నివేదికను వివరిం చారు. జిల్లాలో ఇప్పటివరకు 25 హత్యలు, పగటి పూట దొంగతనాలు 24, రాత్రి పూట దొంగతనాలు 95, కిడ్నాప్‌ కేసులు 50,  అత్యాచారం కేసులు 49, రాబరీ కేసులు 11 నమోదయ్యాయని వివరించారు. చోరీ కే సుల్లో 126 తులాల బంగారంతో పాటు 141 తులాల వెండి రికవరీ చే శామని వివరించారు. జిల్లాలో ఈ ఏడు రోడ్డు ప్రమాదాల్లో 204 మం ది మృతి చెందారని తెలిపారు. ప్రభుత్వం సరఫరా చేసే రేషన్‌ బియ్యం అ క్రమ రవాణాదారులపై 207 కేసులు నమోదుచేసి, 295 మందిని అదు పులోకి తీసుకుని రూ.32,65,050 విలువగల బియ్యాన్ని సీజ్‌ చేసి నట్లు వివరించారు. గేమింగ్‌ ఆక్ట్‌లో భాగంగా 133 కేసులు నమోదు చేసి 777 మందిని అరెస్టు చేసి వారి వద్ద రూ. 19,79, 738 సీజ్‌ చేసినట్లు వివ రించారు. అక్రమ గుట్కా రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టి 157 కేసుల్లో 237 మందిని అరెస్టు చేసి రూ. 40,00,897 సీజ్‌ చేశామని, అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 1190 మందిసై 603 కేసులు నమోదు చేసి రూ.38.28 లక్షల జరిమానా విధించామన్నారు. ఆపరేషన్‌ ముస్కాన్‌ ద్వా రా 119 మంది బాల కార్మికులను గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్ప గించామన్నారు. యువత మత్తుకు బానిసలవుతున్నట్లు గుర్తించి 14 కే సుల్లో 38 మందిని అరెస్టుచేసి 30.165 కిలోల గంజాయి సీజ్‌ చేశామ న్నారు. అనుమతులు తేకుండా నిర్వహిస్తున్న పైనాన్స్‌లపై 14 కేసులు నమోదు చేసి 3.16 కోట్ల డ్యాక్యుమెంట్స్‌ సీజ్‌ చేశామన్నారు. 2022 సం వత్సరంలో ప్రజలందరూ స్నేహపూర్వక పోలీస్‌ విధానాన్ని అవలంభిం చాలని కోరారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ రూపేష్‌ ఉన్నారు.

Updated Date - 2021-12-31T05:02:42+05:30 IST