భూములు పోతే బతికేది ఎలా..?

ABN , First Publish Date - 2021-01-13T05:35:55+05:30 IST

భూములు పోతే ఎలా బతకాలని కాళేశ్వరం ప్రాజెక్టు లింక్‌-2లో భాగంగా నిర్మిస్తున్న పంప్‌ హౌస్‌ నిర్మాణంలో భూములు కోల్పోతున్న నిర్వాసితులు ఆర్డీవో మాధురితో మొర పెట్టుకున్నారు.

భూములు పోతే బతికేది ఎలా..?
వెల్గటూర్‌లో మాట్లాడుతున్న ఆర్డీవో మాధురి

ఆర్డీవోతో కాళేశ్వరం లింక్‌-2 నిర్వాసితుల మొర

వెల్గటూర్‌, జనవరి 12: భూములు పోతే ఎలా బతకాలని కాళేశ్వరం ప్రాజెక్టు లింక్‌-2లో భాగంగా నిర్మిస్తున్న పంప్‌ హౌస్‌ నిర్మాణంలో భూములు కోల్పోతున్న నిర్వాసితులు ఆర్డీవో మాధురితో మొర పెట్టుకున్నారు. మంగళవారం తహసీల్దార్‌ కార్యాలయం ఆవరణలో కాళేశ్వరం లింక్‌ 2కు అవసరమున్న భూ సేకరణ నిమిత్తం అవార్డు ఎంక్వయిరీ నిర్వహించారు. ఈ సందర్భంగా భూ నిర్వాసితులు మాట్లాడుతూ రాష్ట్ర రహదారి పక్కన భూములకు గుంటకు 12 నుంచి 16 లక్షల రూపాయల వరకు విలువ ఉందని అలాంటిది ఎకరాన రూ.12 లక్షల వరకు ఇస్తామనడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. కమర్షియల్‌ భూములకు ఎక్కువ పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పై అధికారులతో మాట్లాడి సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుక పోయి న్యాయం జరిగేలా చూడాలని కోరారు. అనంతరం ఆర్డీవో మాధురి మాట్లాడుతూ 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని ఆదేశాలు ఉన్నాయన్నారు. అయినప్పటికీ సమస్యను కలెక్టర్‌ దృష్టికి తీసుకపోయి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లక్ష్మి, వెల్గటూర్‌, రాజక్కపెల్లి సర్పంచ్‌లు మేరుగు మురళి, బోడకుంటి రమేష్‌, మాజీ జడ్పీటీసీ దొరిశెట్టి వెంకటయ్య, పత్తిపాక వెంకటేష్‌, పెద్దూరి భరత్‌, తహశీల్దార్‌ రాజేంధర్‌, డీటీ అబుబాకర్‌, డీఈ రాంప్రదీప్‌, ఏఈలు విష్ణు, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-01-13T05:35:55+05:30 IST