హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితంపై జాతీయ మీడియా ఫోకస్

ABN , First Publish Date - 2021-11-02T14:01:21+05:30 IST

హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితంపై జాతీయ మీడియా ఫోకస్ పెట్టింది. హుజురాబాద్ కౌంటింగ్ కేంద్రం దగ్గర జాతీయ మీడియా సందడి నెలకొంది.

హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితంపై జాతీయ మీడియా ఫోకస్

కరీంనగర్: హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితంపై జాతీయ మీడియా ఫోకస్ పెట్టింది. హుజురాబాద్ కౌంటింగ్ కేంద్రం దగ్గర జాతీయ మీడియా సందడి నెలకొంది. మరోవైపు హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాల కోసం తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. తెలంగాణలో భవిష్యత్ రాజకీయాలపై హుజూరాబాద్ బైపోల్స్  ప్రభావం చూపనున్నాయి. ఉప ఎన్నిక ఫలితాలపై  కొన్ని ముఠాలు కోట్లాది రూపాయల మేర బెట్టింగ్‌లు కాస్తున్నాయి. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి.  సైలెంట్ ఓటింగ్‌పైనే చర్చ జరుగనుంది. హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు గత ఆరు నెలలుగా హోరాహోరి ప్రచారం సాగించిన విషయం తెలిసిందే. 

Updated Date - 2021-11-02T14:01:21+05:30 IST