విపత్తు సాయంపై ఆశలు

ABN , First Publish Date - 2021-11-28T05:38:38+05:30 IST

కరోనా.. రెండేళ్లుగా ప్రపంచాన్ని వణికించిన మహమ్మారి.

విపత్తు సాయంపై ఆశలు

కొవిడ్‌ బాధిత కుటుంబాలకు రూ. 50 వేల పరిహారం

ఇప్పటివరకు జిల్లాలో 582 దరఖాస్తులు

అధికారుల లెక్కల ప్రకారం 144 మంది మృతులు

దరఖాస్తుల పరిశీలనలో అధికారులు


జగిత్యాల, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): 

ఈ ఫోటోలో కనిపిస్తున్న వృద్ధురాలి పేరు మూట ఆశవ్వ...

జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం వెలుగొండ గ్రామ వాసి. 

కరోనా.. రెండేళ్లుగా ప్రపంచాన్ని వణికించిన మహమ్మారి. కరోనా ప్రభావం వల్ల ఆశవ్వ కుమారుడు మూట నరేశ్‌ (34) 2021 మే 22వ తేదీన ప్రాణాలు కోల్పోయాడు. పదేళ్ల క్రితం అనారోగ్యంతో భర్త చనిపో వడంతో ఆశవ్వ రెక్కల కష్టంతో కుటుంబాన్ని వెళ్లదీస్తోంది. నరేశ్‌ డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న క్రమంలో కరోనా బారిన పడి చనిపోయాడు. దీంతో ఆశవ్వ దిక్కుతోచని స్థితిలో పడి ఒంటరి అ యిపోయింది. ఇటీవల ప్రభుత్వం కొవిడ్‌ మృతుల కుటుంబాలకు విపత్తు సాయం అందిస్తామని ప్రకటించడంతో ఈనెల 22వ తేదీన బుగ్గారంలో ని మీ సేవా కేంద్రంలో ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకొని సహాయం కోసం ఆశతో ఎదురుచూస్తోంది.


ఇలా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా వందల సంఖ్యలో కొవిడ్‌ మృతుల కు టుంబాలు విపత్తు సాయంపై ఆశలు పెంచుకుంటున్నారు. కొన్ని కు టుంబాలు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. మరికొన్ని కుటుంబాలు దరఖాస్తు సమర్పించే పనిలో నిమగ్నమయ్యా రు. ఇంకొన్ని కుటుంబాల కు అవగాహనలేక , అధికారులు ప్రచారం చేయకపోవడం వల్ల కనీసం దరఖాస్తు సైతం చేసు కోవడం లేదు. జిల్లాలో గడిచిన రెండేళ్లలో కొవిడ్‌ కారణంగా మృతి చెందిన వారు వందల సంఖ్యలో ఉన్నారు. ఒకే కుటుం బంలో తండ్రీతనయులు, దంపతులు, అన్నదమ్ములు ఇలా పలువురు రక్త సంబంధీకులు చనిపోవడంతో బాధిత కుటుం బాలు చితికిపో యా యి. కొవిడ్‌ సోకి ఆసుపత్రుల పాలై రూ. లక్షలు వెచ్చించి అవస్థలు, అ ప్పులు మూటకట్టుకొని పలు కుటుంబాలు దీన పరిస్థితిని ఎదుర్కొం టున్నాయి. బాధిత వ్యక్తులకు ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన రూ. 50 వేల విపత్తు సాయం కొంతమేర ఆశను కలిగిస్తోంది. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖాధికారుల లెక్కల ప్రకారం కేవలం 144 మంది మాత్రమే చనిపోయారు. పక్షం రోజులుగా అధికారులు స్వీకరిస్తు న్న దరఖాస్తుల ప్రక్రియలో ఇప్పటివరకు 582 దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలో అనధికార అంచనా ప్రకారం సుమారు 4 వేల మంది వరకు ఉంటారన్న అభిప్రాయాలున్నాయి.

దృవీకరణకు ప్రత్యేక కమిటీ...

జిల్లాలో 2020, 2021 సంవత్సరాల్లో వేలాది మంది కొవిడ్‌ బారిన పడ్డారు. ఇందులో కొంత మంది కొవిడ్‌తో పోరాడి కోలుకున్నారు. మరి కొందరు కొవిడ్‌తో ప్రాణాలు వది లారు. ప్రధానంగా కొవిడ్‌ రెండో దశలో ఎక్కువ మంది మృతి చెందారు. మరికొందరికి కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధార ణ అయినప్పటికీ ప్రభుత్వ రికార్డుల్లో నమోదు కాలేదు. ఇంకొందరు ఆసు పత్రికి వెళ్లేలోపే మృతి చెందారు. ఇలా ఒక్కో బాధిత కుటుంబం ఒక్కో విషాద సంఘటనను కలిగియున్నాయి. ఇలాంటి కుటుంబాలను ఆదుకో వడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. బాధిత కుటుంబా లకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఇందుకు అనుగుణంగా మార్గదర్శకాలను జారీ చేసింది. కొవిడ్‌ వల్ల మృతి చెందినట్లు అధికా రికంగా దృవీకరణ ప్రతం జారీ చేయడానికి త్రిసభ్యక మిటీని ఏర్పాటు చేశారు. కలెక్టర్‌ అధ్యక్షుడిగా, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, ఆయా ఆసుపత్రుల కో ఆర్డినేటర్లు సభ్యులుగా ఉంటున్నారు. విపత్తు సాయం కో రుతూ బాధిత కుటుంబాలు మీ సేవ కేంద్రాల ద్వారా కలెక్టరుకు ఆన్‌ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటోంది. వాటిని త్రిసభ్య కమిటీ పరి శీలించి అర్హులను గుర్తిస్తుంది. విపత్తు నిర్వహణ పరిహారాన్ని దరఖాస్తు దారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. 

దరఖాస్తుతో ఏమేం జతపర్చాలి.. 

కొవిడ్‌ బారిన పడి మృతి చెందిన వ్యక్తుల కుటుంబ సభ్యులు విపత్తు సాయానికి దరఖాస్తు చేసుకోవచ్చును. మీ సేవ కేంద్రం ద్వారా ఆన్‌లైన్‌ లో కలెక్టరుకు దరఖాస్తులను సమర్పించాలి. మీ సేవా కేంద్రానికి వెళ్లేట ప్పుడు కొవిడ్‌ సోకి మరణించిన వ్యక్తి ఆధార్‌ కార్డు, మరణ దృవీకరణ పత్రం, కొవిడ్‌ నిర్ధారణ నివేదిక, నామిని ఆధార్‌ కార్డు, బ్యాంకు ఖాతా పత్రాలు, రేషన్‌ కార్డు, పరీక్షలు, చికిత్స చేయించుకున్న ఆసుపత్రి రిపో ర్టు తీసుకవెళ్లాలి. కొవిడ్‌ సోకిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నా, ప్రమా దాల బారిన పడి మృతి చెందినా ఇది వర్తించదని ప్రభుత్వం మార్గద ర్శకాల్లో పేర్కొంది. కొవిడ్‌ సోకిన దృవపత్రం కలిగి ఉండి ఇంటి వద్దే చికి త్స పొందుతూ మరణించిన వారి కుటుంబాలు దరఖాస్తు చేసుకోవడా నికి అర్హులుగా ప్రభుత్వం గుర్తిస్తుంది.

దరఖాస్తుల్లో గందరగోళం...

కొవిడ్‌ సోకి మృతి చెందిన వ్యక్తుల కుటుంబ సభ్యులు చేసుకుంటున్న దరఖాస్తులు గజిబిజిగా గందరగోళంగా ఉంటున్నాయని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు అంటున్నాయి. దరఖాస్తుతో పాటు జత పరచాల్సిన పత్రా లను చేర్చకపోవడం, వివరాలను సక్రమంగా ఇవ్వకపోవడం వల్ల పరిశీ లనలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్న అభిప్రాయాలున్నాయి. కొందరు కొవిడ్‌ వల్ల ఆసుపత్రుల్లో చనిపోతే, తమ సొంత గ్రామంలో మృతి చెం దినట్లు మరణ దృవీకరణ పొందుపరచడం, రేషన్‌కార్డులు జతపరచకపో వడం, ఆధార్‌ కార్డు సరిగా లేకపోవడం, ఒక్క తేదిలో మృతి చెందితే, కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ నివేదికలో మరో తేదిలో శాంపిల్‌ సేకరించిన ట్లు ఉండడం వంటి పలు లోపాలలతో దరఖాస్తులు వస్తున్నాయని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు అంటున్నాయి. దీంతో దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లో పరిహారం అందించాలన్న నిబంధన అమలు చేయడం ప్రశ్నా ర్థకంగా మారుతుందన్న అభిప్రాయాలున్నాయి.

దరఖాస్తుల పరిశీలన చేస్తున్నాము

- పుప్పాల శ్రీధర్‌, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, జగిత్యాల

విపత్తు సాయం కింద కొవిడ్‌ మృతుల కుటుంబాలకు అందించనున్న రూ. 50 వేల సాయం కొరకు చేసుకున్న దరఖాస్తులను పరిశీలిస్తున్నా ము. దరఖాస్తులతో జతపరచాల్సిన పత్రాలను సక్రమంగా పొందుపర చడం లేదు. దీంతో పరిశీలనలో జాప్యం ఏర్పడుతోంది. దరఖాస్తుతో ఇస్తున్న వివరాలు సక్రమంగా ఉండడం లేదు. అర్హులందరికి సాయం అందేలా చర్యలు తీసుకుంటున్నాము.


అర్హులందరికీ విపత్తు సాయం అందించాలి

- అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు, జగిత్యాల

అర్హులందరికీ విపత్తు సాయం వెంటనే అందించాలి. దరఖాస్తుల పరిశీలన వేగవంతంగా జరపాలి. దృవీకరణ పత్రాల పేరిట కాలయాపన జరగకుండా జాగ్రత్తలు వహించాలి. అసలే అయిన వారిని కోల్పోయి దీ నావస్థలో ఉన్న కుటుంబాలను సకాలంలో ఆదుకుంటేనే సర్కారు లక్ష్యం నెరవేరుతుంది.


Updated Date - 2021-11-28T05:38:38+05:30 IST