ఆధునిక పద్ధతులతో అధిక దిగుబడి సాధించాలి

ABN , First Publish Date - 2021-02-06T05:09:36+05:30 IST

ఆధునిక పద్ధలతో పంటలను సాగు చేయాలని, అధిక దిగుబడి సాధించాలని జాతీయ కో ఆపరేటివ్‌ బ్యాంకుల చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు అన్నారు. మండలంలోని గజసింగవరంలో క్షేత్రస్థాయి దినోత్స వం సందర్భంగా జిల్లా ఏరువాక వ్యవసాయ కేంద్రం ఆధ్వ ర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడా రు.

ఆధునిక పద్ధతులతో అధిక దిగుబడి సాధించాలి
గజసింగవరంలో అవగాహన సదస్సులో మాట్లాడుతున్న కొండూరు రవీందర్‌రావు

గంభీరావుపేట, పిబ్రవరి 5 : ఆధునిక పద్ధలతో పంటలను సాగు చేయాలని, అధిక దిగుబడి సాధించాలని జాతీయ కో ఆపరేటివ్‌ బ్యాంకుల చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు అన్నారు. మండలంలోని గజసింగవరంలో క్షేత్రస్థాయి దినోత్స వం సందర్భంగా జిల్లా ఏరువాక వ్యవసాయ కేంద్రం ఆధ్వ ర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడా రు. ప్రభుత్వ ప్రోత్సాహిన్న సద్వినియోగం చేసుకోవాలని, ఆధునిక పద్ధతులతో పంటలు సాగు చేసుకోవాలని సూచిం చారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. అంతకు ముందు జయశంకర్‌ కళాశాల వ్యవసాయ శాస్త్ర వేత్తలు ఆధునిక పద్దతులు, పం టల సాగు విధానంపై అవగాహన కల్పించారు. 


గొర్రెల షెడ్డుల పరిశీలన..

గంభీరావుపేట మండలం సముద్రంలింగాపూర్‌లో గొర్రెల షెడ్డులను కొండూరు రవీందర్‌రావు,  పీడీ కౌటీల్యరెడ్డి  పరిశీలించారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో సాముహికంగా ఒకేచోట 43 షెడ్డులను ఏర్పాటు చేసుకోవడం ఆదర్శనీయమని రవీందర్‌రావు అన్నారు. అనంతరం మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల నూతన భవనాలను పరిశీలించారు. టీఆర్‌ఎస్‌ వ్యవస్థాపక ఉపాధ్యక్షుడు కొండూరు గాంధీ, సర్పంచులు బాలరాజు,  పావని, ఎంపీపీ   కరుణ, జడ్పీటీసీ విజయ, వైస్‌ ఎంపీపీ లత, సింగిల్‌విండో వైస్‌ చైర్మన్‌ రామాంజనేయులు, సెస్‌ డైరెక్టర్‌ దేవేందర్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు వెంకటస్వామి, ఏఎంసీ చైర్మన్‌ బాలవ్వ, ఆర్‌బీఎస్‌ చైర్మన్‌ రాజేందర్‌, స్థానిక ఎంపీటీసీ అంజిరెడ్డి, సింగిల్‌విండో డైరెక్టర్‌ శేఖర్‌గౌడ్‌, సర్పంచుల  ఫోరం అధ్యక్షుడు రాజిరెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్‌, ఏపీడీ కృష్ణ, ఉప సర్పంచులు అశోక్‌, దేవరెడ్డి. నాయకులు  పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-06T05:09:36+05:30 IST