ఆహ్లాదంగా ‘సన్డే ఫన్ డే’
ABN , First Publish Date - 2021-10-25T06:14:54+05:30 IST
కొవిడ్ తీవ్రతతో తాత్కా లికంగా నిలిచిన ‘సన్ డే ఫన్డే’ మ్యూజికల్ లైటింగ్ షోను ఆదివారం తిరిగి ప్రారంభించారు. సి
సిరిసిల్ల టౌన్, అక్టోబరు 24: కొవిడ్ తీవ్రతతో తాత్కా లికంగా నిలిచిన ‘సన్ డే ఫన్డే’ మ్యూజికల్ లైటింగ్ షోను ఆదివారం తిరిగి ప్రారంభించారు. సిరిసిల్ల పట్టణలోని బతుకమ్మ ఘాట్ వద్ద మున్సిపల్ ఆధ్వర్యంలో సన్డే ఫన్డేలో భాగంగా సాయ ంత్రం 5 గంటలకు ప్రత్యేక వేదికను ఏర్పాటు చేశారు. లోకల్ టాలెంట్‌ను గుర్తించడం కోసం ఆటాపాటల పోటీలను నిర్వహించారు. పట్ట ణానికి చెందిన చిన్నారులు ప్రదర్శనతో ఆకట్టు కున్నారు. ఒక వైపు చిన్నారుల ఆటాపాటలు, మరో వైపు మ్యూజికల్ లైటింగ్ షోతో ఆహ్లాద వాతావరణం నెలకొంది. చిన్నారులకు ఎస్పీ రాహుల్‌హెగ్డే, మున్సిపల్ చైర్ పర్సన్ కళాచక్రపాణి, కమిషనర్ సమ్మయ్య బహు మతులను అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.