గల్ఫ్‌ బీమా ప్రవేశపెట్టాలి

ABN , First Publish Date - 2021-10-22T05:11:39+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్‌ బీమా ప్రవేశపెట్టాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

గల్ఫ్‌ బీమా ప్రవేశపెట్టాలి
మాట్లాడుతున్న ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

- ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

వెల్గటూర్‌, అక్టోబరు 21: రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్‌ బీమా ప్రవేశపెట్టాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. వెల్గటూర్‌ సర్పంచ్‌ మేరుగు మురళి సోదరుడు మేరుగు సత్తయ్య గల్ఫ్‌లో మృతి చెందడంతో గురువారం ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విఽధిలేని పరిస్థితిలో దేశంకాని దేశంలో జీవనోపాధి పొందుతున్న గల్ఫ్‌ కార్మికులు తెలంగాణ వస్తే తమ బతుకులు బాగుపడుతాయని తెలంగాణ ఉధ్యమంలో భాగస్వాములు అయ్యారన్నారు. తెలంగాణ వచ్చినా అప్పులు చేసి గల్ఫ్‌ దేశాలకు వలస పోతున్న వారి సంఖ్య పెరుగుతుండడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. గల్ఫ్‌ కార్మికుల స్వయం ఉపాధి పథకాలలో 25 శాతం, వారి పిల్లల చదువులకు 10 శాతం రిజర్వ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. గల్ఫ్‌ ఎన్‌ఆర్‌ఐ బోర్డు ఏర్పాటు చేయాలని, ఇళ్లు లేని గల్ఫ్‌ కార్మికులకు ఇళ్లు కట్టించేలా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, వెల్గటూర్‌, గొల్లపెల్లి మండలశాఖ అధ్యక్షులు శైలేంధర్‌రెడ్డి, నిశాంత్‌రెడ్డి, ఉదయ్‌, నరేష్‌, శ్రీనివాస్‌, వేణు, అజయ్‌, తిరుమలేష్‌, ప్రవీణ్‌, నరేష్‌, సుమన్‌, రమణమేస్త్రీ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-22T05:11:39+05:30 IST