వస్త్ర పరిశ్రమపై జీఎస్టీ ఉపసంహరించుకోవాలి

ABN , First Publish Date - 2021-12-29T05:22:44+05:30 IST

వస్త్ర పరిశ్రమను కుదేలు చేసే జీఎస్టీ పన్ను ఉపసంహారించుకోవాలని డిమాండ్‌ చేస్తూ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమల ఐక్యవేదిక ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్ష రెండవ రోజు కొనసాగింది.

వస్త్ర పరిశ్రమపై జీఎస్టీ ఉపసంహరించుకోవాలి
దీక్షలో వస్త్ర పరిశ్రమ నిర్వాహకులు

- సిరిసిల్లలో రెండవ రోజు కొనసాగిన దీక్ష 

- మద్దతు తెలిపిన మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళచక్రపాణి

సిరిసిల్ల, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): వస్త్ర పరిశ్రమను కుదేలు చేసే జీఎస్టీ పన్ను ఉపసంహారించుకోవాలని డిమాండ్‌ చేస్తూ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమల ఐక్యవేదిక ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్ష రెండవ రోజు కొనసాగింది. మంగళవారం సిరిసిల్ల గాంధీచౌక్‌ వద్ద దీక్షలను మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళచక్రపాణి ప్రారంభించారు. దీక్షల వద్ద వివిధ పక్షాల నాయకుల జీఎస్టీ పెంపు ఉపసంహారించుకోవాలంటూ నిరసనలు వెల్లువెత్తాయి. రెండవ రోజు దీక్షల్లో పాలిస్టర్‌ వస్త్రోత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు మండల సత్యం, ప్రధాన కార్యదర్శి వెల్దండి దేవదాస్‌, ఉపా ధ్యక్షుడు బూట్ల నవీన్‌, సహాయ కార్యదర్శి పోరండ్ల మల్లేశం, కోశాధికారి శ్రీరాం సత్యనారాయణ, డైయింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు తాటి పాము ల దామోదర్‌, ప్రధాన కార్యదర్శి కోడం శ్రీనివాస్‌, మ్యాక్స్‌ సంఘాల అసోసియేషన్‌ అధ్యక్షుడు యెల్దండి శంకర్‌, ప్రధాన కార్యదర్శి పోలు శంకర్‌లతో పాటు మండల బాలరాజు, బండారి అశోక్‌, సామల గణేష్‌, మాదాసు శ్రీనివాస్‌, గాజుల భాస్కర్‌, బిల్ల విష్ణు, రాజశేఖర్‌, హను మాండ్ల రాంనారాయణ, దత్తు, బోగ తిరుపతి, దూడం సురేష్‌, రఘు నందన్‌లు కూర్చున్నారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ జిందం కళచ క్రపాణి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వస్త్ర పరిశ్రమపై 5 శాతం నుంచి 12 శాతానికి జీఎస్టీ పన్ను పెంచడం ద్వారా చేనేత మరమగ్గాల పరిశ్ర మలు సంక్షోభంలో పడుతాయని అన్నారు. జీఎస్టీ పన్నును పూర్తిగా ఎత్తివేసి పరిశ్రమను అదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభు త్వం వెంటనే స్పందించాలని డిమాండ్‌ చేశారు. దీక్షలకు సంఘీభావాన్ని టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్షుడు అకునూరి శంకరయ్య, రైతు బంధు సమితి అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ అడెపు రవీందర్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మంచె  శ్రీనివాస్‌, పద్మశాలి సంఘం అధ్యక్షుడు గోలి వెంకట రమణ, వ్యాపార సంఘం అధ్యక్షుడు రాపెల్లి లక్ష్మీనారాయణ, కాటన్‌ వస్త్రోత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు కట్టెకోల లక్ష్మీనారాయణ, పద్మశాలి యువజన సంఘం అధ్యక్షుడు గుండ్లపల్లి పూర్ణచందర్‌, డైయింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు జెగ్గాని మల్లేశం, సీపీఎం కార్యదర్శి మూషం రమేష్‌, సీపీఐ ప్రతినిధి మల్లేశం సంఘీభావం తెలిపారు. 

Updated Date - 2021-12-29T05:22:44+05:30 IST