డెయిరీ యూనిట్ల గ్రౌండింగ్‌ను వేగంగా చేపట్టాలి

ABN , First Publish Date - 2021-01-13T05:11:49+05:30 IST

జిల్లాలో డెయిరీ యూనిట్ల పంపిణీ గ్రౌండింగ్‌ను వేగంగా చేపట్టాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఆదేశించారు.

డెయిరీ యూనిట్ల గ్రౌండింగ్‌ను వేగంగా చేపట్టాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా అధికారులు

- వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌

పెద్దపల్లి, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో డెయిరీ యూనిట్ల పంపిణీ గ్రౌండింగ్‌ను వేగంగా చేపట్టాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఆదేశించారు. మంగ ళవారం అన్ని జిల్లాల అధికారులతో మంత్రి వీడియో కాన్ఫ రెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గం ఏర్పా టుచేయాలని భావించి పైలెట్‌ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టా మన్నారు. వ్యవసాయానికి తోడుగా అదనపు ఆదాయం కో సం పాల ఉత్పత్తిని పెంచేందుకు ధర్మపురి నియోజకవర్గం లోని ధర్మారం మండలంలో పైల ట్‌ ప్రాజెక్టు చేపట్టామన్నారు. 40 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి 4 లక్షల వ్యయంతో 4 పాడి పశువులను ఇస్తామన్నారు. ఇందు లో సబ్సిడీ కింద 2 లక్షల 40 వేల రూపాయలు ప్రభుత్వం ద్వారా ఇ స్తామన్నారు. హర్యానా ఇతర రా ష్ట్రాల నుంచి పశువులను తీసుకుని రావాలని, ముందుగా సాంకేతికత పరిజ్ఞానాన్ని, కమ్యూనికేన్‌ సాధనా లను ఉపయోగించుకోవాలన్నారు. రవాణా వ్యయం వృథా గాకుండా చూడాలన్నారు. 40మంది లబ్ధిదా రుల్లో 34మందికి డాక్యుమెంటేషన్‌ ప్రక్రియ పూర్తయ్యిందని, మిగతా వారికి పూర్తిచేయాలన్నారు. వచ్చేనెల డెయిరీ యూనిట్ల గ్రౌండింగ్‌ పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పశువులకు బీమా ట్యాగింగ్‌, వాటరింగ్‌, ఫుడ్‌, షేడ్స్‌, ఇతర అంశాలపై పశుసంవర్థక శాఖాధికారులు లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ వి లక్ష్మీనారాయణ, ఆర్‌డీఓ శంకర్‌ కుమార్‌, జిల్లా సంక్షేమ శాఖాధికారి సుగుణ, ఎస్సీ కార్పొరే షన్‌ ఈడీ సరిత, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-13T05:11:49+05:30 IST