పక్కా ప్రణాళికతో ధాన్యం కొనుగోళ్లు

ABN , First Publish Date - 2021-10-28T06:10:22+05:30 IST

పక్కా ప్రణాళికతో ధాన్యం కొనుగోలుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సిద్ధంగా ఉందని న్యాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు అన్నారు. గంభీరావుపేట మండలం దమ్మన్నపేటలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ప్రారం భించారు.

పక్కా ప్రణాళికతో ధాన్యం కొనుగోళ్లు
దమ్మన్నపేటలో కొనుగోలు కేంద్రం ప్రారంభిస్తున్న కొండూరు రవీందర్‌రావు

- నాప్స్‌కాప్‌ చైర్మెన్‌ కొండూరు రవీందర్‌రావు

గంభీరావుపేట, అక్టోబరు 27 : పక్కా ప్రణాళికతో ధాన్యం కొనుగోలుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సిద్ధంగా ఉందని న్యాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌  కొండూరు రవీందర్‌రావు అన్నారు. గంభీరావుపేట మండలం దమ్మన్నపేటలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన  ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ప్రారం భించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతాంగ అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని,  రైతుల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా ముందుకు సాగుతోందని అన్నారు. ప్రతీ గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందవద్దని అన్నారు.  ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధర కల్పించనున్నట్లు చెప్పారు.  ఏడున్నరేళ్లుగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విద్య, వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందన్నారు. మారుమూల గ్రామాల్లో  వైద్యం అందేందుకు ఆరోగ్య ఉప కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.  అంతకు ముందు జగదాంబతండాలో ఆరోగ్య ఉప కేంద్రం పనులకు భూమిపూజ చేశారు. అనంతరం దమ్మన్నపేట, మండల కేంద్రంలో  కల్యాణలక్ష్మి, సీఎంరిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను అందజేశారు. ఎంపీపీ వంగ కరుణ, జడ్పీటీసీ కొమిరిశెట్టి విజయ, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పాపగారి వెంకటస్వామి, ఏఎంసీ చైర్మన్‌ సుతారి బాలవ్వ, సింగిల్‌విండో ఉపాధ్యక్షుడు రామాంజనేయులు, వైస్‌ ఎంపీపీ దోసల లత, మండల సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు రాజిరెడ్డి, సర్పంచ్‌ లక్ష్మి, ఎంపీటీసీ కవిత, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి రాజు, పట్టణ కార్యదర్శి అభిలాష్‌,  సీఈవో రాజిరెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు లత, నాయకులు రెడ్డిమల్ల రాజనర్సు, హన్మంతరెడ్డి, శేఖర్‌గౌడ్‌, నాగరాజు, శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు. 

Updated Date - 2021-10-28T06:10:22+05:30 IST