ధాన్యం కొనుగోళ్లు మరింత వేగవంతం చేయాలి
ABN , First Publish Date - 2021-11-28T05:43:14+05:30 IST
ధాన్యం కొనుగోలు, పంట మా ర్పిడి, సీఎంఆర్ రైస్ డెలివరి అంశాలపై కలెక్టర్లు, ఎస్పీలతో చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహిం చారు.

- రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్
జగిత్యాల, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): ధాన్యం కొనుగోలు, పంట మా ర్పిడి, సీఎంఆర్ రైస్ డెలివరి అంశాలపై కలెక్టర్లు, ఎస్పీలతో చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహిం చారు. పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో జరిగి వీడియో కాన్ఫరెన్స్‌కు కలెక్టర్ రవి నాయక్, ఎస్పీ సింధూ శర్మలు పాల్గొన్నారు. ఈసందర్బంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడారు. కలెక్టర్ ప్రతీ రోజు ధాన్యం కొనుగో లు కేంద్రాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని సూచించారు. పెండింగ్ మిల్లింగ్ రైస్ లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి వరి రవాణాను అరికట్టాల న్నారు. వానాకాలం పంట పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని, రవాణా, అన్ లోడింగ్ సమస్యలను అదిగమించాలన్నారు. పూర్తి స్థాయిలో వరి ధా న్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి కొనుగోళ్లు జరపాలన్నారు. రైతు వేదికలో ప్రత్యామ్నాయ పంట సాగుపై రైతులకు ఎక్కువ అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు.