ధాన్యం కొనుగోళ్లు త్వరితగతిన పూర్తిచేయాలి

ABN , First Publish Date - 2021-05-21T05:40:13+05:30 IST

ధాన్యం కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ కె.శశాంక ఆదేశించారు.

ధాన్యం కొనుగోళ్లు త్వరితగతిన పూర్తిచేయాలి
కొత్తపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ కె శశాంక

-కలెక్టర్‌ కె.శశాంక

కరీంనగర్‌ రూరల్‌, మే20: ధాన్యం కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ కె.శశాంక ఆదేశించారు. గురువారం కొత్తపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కొనుగోలు చేసిన ధాన్యాన్ని రోజువారీగా రైస్‌ మిల్లులకు పంపించాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా టార్ఫాలిన్‌ కవర్లు కప్పి ఉంచాలని రైతులకు సూచించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైతులకు రసీదులు ఇవ్వాలని సూచించారు. హమాలీలు, గన్నీ బ్యాగుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌, తహసీల్దార్‌ శ్రీనివాస్‌, అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-21T05:40:13+05:30 IST