ప్రభుత్వ లక్ష్యాలను విజయవంతం చేయాలి
ABN , First Publish Date - 2021-07-08T05:34:39+05:30 IST
పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి పనులతో పాటు మౌలిక వసతులు కల్పిస్తోందని స్వచ్ఛ భారత్ అసి స్టెంట్ కమిషనర్ రమేష్‌బాబు అన్నారు.

- పల్లెలన్నీ పచ్చదనంతో ఉండాలి
- స్వచ్ఛ భారత్ మిషన్ అసిస్టెంట్ కమిషనర్ రమేష్ బాబు
సుల్తానాబాద్, జూలై 7: పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి పనులతో పాటు మౌలిక వసతులు కల్పిస్తోందని స్వచ్ఛ భారత్ అసి స్టెంట్ కమిషనర్ రమేష్‌బాబు అన్నారు. మండంలోని సాం బయ్యపల్లి గ్రామాన్ని ఆయన బుధవారం తనిఖీ చేశారు. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా మండల స్థాయి అధికా రులు చేపడుతున్న పనులను పరిశీలించారు. గ్రామంలో చే పట్టిన శ్మశానవాటిక, వైకుంఠధామం, పల్లెప్రకృతి వనం, తడిచెత్త, పొడిచెత్త వేరుచేసే పనులు, నర్సరీలను గ్రామం లోని పలు కాలనీలను, ఇతర అభివృద్ధి పనులు పరిశీలించా రు. గ్రామంలోని నర్సరీ నిర్వహణ పట్ల సంతోషం వ్యక్తం చే శారు. మొక్కల సంరక్షణ మొదలు అన్నీ బాగా ఉన్నాయం టూ వన సేవకురాలు లంకదాసరి అరుణను సన్మానించా రు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలాజీరావు, ఎంపీడీఓ శశి కళ, సర్పంచ్ బాపిరెడ్డి, ఎంపీటీసీ గట్టు శ్రీనువాస్‌తో పాటు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.