అండర్ కెనాల్‌లో పడిపోయిన గోమాత
ABN , First Publish Date - 2021-08-03T05:34:38+05:30 IST
జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్‌లో ఉన్న అండర్ కేనాలో ప్రమాదావశాత్తు గోమాత పడిపోగా స్థానికులు క్రేన్ సహాయంతో బయటకు తీసి గోమాతను కాపాడి మానవత్వాన్ని చాటు కున్నారు.

క్రేన్ సహాయంతో బయటకు తీసిన స్థానికులు
జగిత్యాల టౌన్, ఆగస్టు 2: జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్‌లో ఉన్న అండర్ కేనాలో ప్రమాదావశాత్తు గోమాత పడిపోగా స్థానికులు క్రేన్ సహాయంతో బయటకు తీసి గోమాతను కాపాడి మానవత్వాన్ని చాటు కున్నారు. పట్టణంలోని బైపాస్ రోడ్‌లో దాదాపు 15 ఏళ్ల క్రింతం అండర్ గ్రౌండ్ కెనాల్‌ను నిర్మించారు. ఇటీవల వర్షాలు కురవడంతో ఆవులు పచ్చిగడ్డి మేత కోసం కెనాల్‌పైకి వచ్చాయి. మేత మేస్తున్న ఓ గోమాత కెనాల్‌పై ఉన్న పైకప్పు కూలి అందులో పడిపోయింది. మూగజీవి అ రుపులు వేయడంతో స్థానిక కౌన్సిలర్లు వల్లెపు రేణుక మొగిలి, గుర్రం రమేష్, బీజేపీ నాయకుడు జిట్టవేణి అరుణ్‌లు స్పందించారు. తక్షణమే భారీ క్రేన్‌ను సమకూర్చి కెనాల్‌లో పడ్డ గోమాతను బయటకు తీసి రక్షించారు. మూగజీవిని ప్రాణాలతో కాపాడిన నాయకులను స్థానికులు అభినందించారు.