ఘనంగా ఎంఆర్‌పీఎస్‌ ఆవిర్భావ వేడుకలు

ABN , First Publish Date - 2021-07-08T05:38:06+05:30 IST

ఎంఆర్‌పీఎస్‌ 27వ ఆవిర్భావ వేడుకల ను బుధవారం జీఎం కాలనీలో ఎంఆర్‌పీఎస్‌ నాయకులు రాసపెల్లి రవికుమార్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఘనంగా ఎంఆర్‌పీఎస్‌ ఆవిర్భావ వేడుకలు
కేక్‌ కట్‌ చేస్తున్న ఎంఆర్‌పీఎస్‌ నాయకులు

కళ్యాణ్‌నగర్‌, జూలై 7: ఎంఆర్‌పీఎస్‌ 27వ ఆవిర్భావ వేడుకల ను బుధవారం జీఎం కాలనీలో ఎంఆర్‌పీఎస్‌ నాయకులు రాసపెల్లి రవికుమార్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంఆర్‌పీఎస్‌ నాయకులు ఉప్పులేటి పర్వతాలు హాజరై జెండావిష్కరించి కేక్‌కట్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రొడ్డ సంపత్‌, మాతంగి కుమార్‌, పద్మ, వనమాల, అంజమ్మ, శాంతమ్మ, కనకలక్ష్మి పాల్గొన్నారు. గోదావరిఖనిచౌరస్తా లో ఎంఆర్‌పీఎస్‌ నాయకుడు పల్లెబాబు ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎం ఆర్‌పీఎస్‌ నాయకులు మడిపల్లి దశరథం హాజరై జెండావిష్కరణ చేశారు. కార్యక్రమంలో రాజయ్య, ధర్మేందర్‌, మాతంగి కుమార్‌, కాంపె ల్లి స్వామి, మధునయ్య, సాంబయ్య, కొమురయ్య, రమేష్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-08T05:38:06+05:30 IST