ఘనంగా మొల్లమాంబ జయంతి వేడుకలు
ABN , First Publish Date - 2021-03-14T05:51:19+05:30 IST
రామాయణాన్ని సంస్కృతంలో నుంచి తెలుగులోకి అనువదించిన తొలి తెలుగు కవయిత్రి మొల్లమాంబ అని తెలంగాణ కుమ్మరి సంఘం జిల్లా అధ్యక్షుడు మామిడిపెల్లి కృష్ణ అన్నారు.
జగిత్యాల టౌన్, మార్చి 13: రామాయణాన్ని సంస్కృతంలో నుంచి తెలుగులోకి అనువదించిన తొలి తెలుగు కవయిత్రి మొల్లమాంబ అని తెలంగాణ కుమ్మరి సంఘం జిల్లా అధ్యక్షుడు మామిడిపెల్లి కృష్ణ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని 10 వార్డులో ఉన్న లింగంపేట కుమ్మరి సంఘం భవనంలో శనివారం తొలి తెలుగు కవయిత్రి మొల్లమాంబ జయంతి వేడుకలను తెలంగాణ కుమ్మరి సంఘం జిల్లా ఆధ్వర్యంలో ఘ నంగా నిర్వహించారు. మొల్లమాంబ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు కృష్ణ మా ట్లాడుతూ రానున్న మొల్లమాంబ జయంతిని ప్రభుత్వం అధికారికంగా జరుపాలని డిమాండ్ చేశారు. కుమ్మరి కులస్థులకు ప్రభుత్వం సబ్సిడీ రుణాలతో పాటు కుండల తయారీకి ఆధునిక పరికరాలను అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా కేంద్రంలో శాలివాహన సంఘ భవనానికి ప్రభుత్వం 5 ఎకరాల స్థలాన్ని కేటాయించి, కుమ్మరుల తయారు చేసిన వస్తువులను మార్కెట్‌లో విక్రయించేందుకు ప్రత్యేక స్థలాన్ని కేటాయించా లన్నారు. 50ఏళ్లు నిండిన కుమ్మర కుల వృత్తిదారులకు రూ.2 వేల పిం ఛన్ ఇవ్వాలని, బడ్జెట్‌లో కుమ్మరుల సంక్షేమానికి రూ. 100 కోట్లు కేటా యించాలన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో కుల సంఘ భవనాలు నిర్మిం చుకునేందుకు ప్రభుత్వ స్థలాలతో పాటు నిధులు కేటాయించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఐలాపురం తిరుపతి, రాజకీయ విభాగం అధ్యక్షుడు కెల్లేటి రమేష్, కౌన్సిలర్ సిరికొండ భారతి, నాయకులు రాజన్న, శ్రీనివాస్, మహిపాల్, నరేష్, లక్ష్మణ్, అనీల్, శ్రీనివాస్, ప్రవీణ్, గంగాధర్, ధర్మయ్య, శంకర్, అంజయ్య, భూమయ్య పాల్గొన్నారు.