మున్సిపల్‌ కమిషనర్‌గా గరిమ అగర్వాల్‌

ABN , First Publish Date - 2021-09-03T05:17:15+05:30 IST

అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) గరిమ అగర్వాల్‌కు కరీంనగర్‌ నగరపాలక సంస్థ మున్సిపల్‌ కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ సీడీఎంఏ డాక్టర్‌ ఎన్‌.సత్య నారాయణ ఉత్తర్వులు జారీ చేశారు.

మున్సిపల్‌ కమిషనర్‌గా గరిమ అగర్వాల్‌
మున్సిపల్‌ కమిషనర్‌గా బాధ్యతలనుస్వీకరిస్తున్న గరిమ అగర్వాల్‌

పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరణ

కరీంనగర్‌ టౌన్‌, సెప్టెంబరు 2: అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) గరిమ అగర్వాల్‌కు కరీంనగర్‌ నగరపాలక సంస్థ మున్సిపల్‌ కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ సీడీఎంఏ డాక్టర్‌ ఎన్‌.సత్య నారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం మధ్యాహ్నం ఆమె మున్సిపల్‌ కార్యాలయంలో కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమెను మున్సిపల్‌ అధికారులు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. 


పారిశుధ్య పనుల తనిఖీ  


నగరంలోని 18వ డివిజన్‌ రేకుర్తిలో చేపడుతున్న పారిశుధ్య పనులను జిల్లా అదనపు కలెక్టర్‌, మున్సిపల్‌ ఇన్‌చార్జి కమిషనర్‌ గరిమా అగర్వాల్‌ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఖాళీ స్థలాల్లో నిలిచిన నీటిలో ఆయిల్‌ బాల్స్‌ వేయించారు. అన్ని డివిజన్లలో దోమల నివారణ చర్యలను చేపట్టాలని, స్ర్పే చేయా లని, మురుగునీటి కాలువలను ఎప్పటిక ప్పుడు శుభ్రం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ సానిటరీ సూపర్‌ వైజర్‌ రాజమనోహర్‌, సానిటరీ ఇన్‌స్పెక్టర్‌ గట్టు శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-09-03T05:17:15+05:30 IST