శ్రీసీతారాములకు పుష్పయాగం

ABN , First Publish Date - 2021-05-02T06:10:50+05:30 IST

శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయంలో జరిగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా పుష్పయాగం (నాకబలి) కార్యక్రమం శనివారం కన్నుల పండువగా జరిగింది.

శ్రీసీతారాములకు పుష్పయాగం
స్వామివారికి పుష్పయాగం నిర్వహిస్తున్న అర్చకులు

ఇల్లందకుంట, మే 1: శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయంలో జరిగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా పుష్పయాగం (నాకబలి) కార్యక్రమం శనివారం కన్నుల పండువగా జరిగింది. వేదబ్రాహ్మణుల మంత్రోచ్ఛరణాల నడుమ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శ్రీసీతరాముల శ్రీపుష్పయాగం ఆలయ ప్రధాన అర్చకులు శేషం రామాచార్యుల ఆధ్వర్యంలో ఈవో కందుల సుధాకర్‌ పర్యవేక్షణలో ఆలయ ప్రాకార మండపంలో నిర్వహించారు. భక్తులు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ  స్వామివారికి మొక్కులు చెల్లించుకొన్నారు. కార్యక్రమంలో అర్చకులు వంశీధరాచార్యులు, యాజ్ఞికులు శేషం సీతారామాచార్యులు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-02T06:10:50+05:30 IST