మచ్చలేని నాయకుడు వాజ్‌పేయి

ABN , First Publish Date - 2021-12-26T06:04:57+05:30 IST

మచ్చలేని నాయకుడు, మాజీ ప్రధాని, దివంగత అటల్‌ బిహారి వాజ్‌పేయి అని, స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొ న్న మహానాయకుడని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సోమారపు సత్యనారాయ ణ అన్నారు.

మచ్చలేని నాయకుడు వాజ్‌పేయి
‘ఖని’లో వాజ్‌పేయి చిత్రపటానికి పూలమాల వేస్తున్న బీజేపీ నాయకులు

- బీజేపీ జిల్లా అధ్యక్షుడు సోమారపు సత్యనారాయణ  

- ఘనంగా వాజ్‌పేయి జయంతి 

కళ్యాణ్‌నగర్‌, డిసెంబరు 25: మచ్చలేని నాయకుడు, మాజీ ప్రధాని, దివంగత అటల్‌ బిహారి వాజ్‌పేయి అని, స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొ న్న మహానాయకుడని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సోమారపు సత్యనారాయ ణ అన్నారు. వాజపేయి 97వ జయంతి సందర్భంగా గోదావరిఖని శివాజీనగర్‌లోని బీజేపీ కార్యాలయంలో నగర అధ్యక్షుడు గుండబోయిన లక్ష్మణ్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై వాజ్‌పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకునిగా, ఉత్తమ పార్లమెంటేరియన్‌గా, ఓటమి ఎరుగని నేతగా దేశంలోని ప్రతిపక్షాలతో మన్ననలు పొందిన వాజ్‌పేయికి భారత రత్న లభించింద న్నారు. 26 ప్రాంతీయ పార్టీలతో ఎన్‌డీఏను స్థాపించి బీజేపీకి తిరుగులేని విజయం సాదించారన్నారు. బీజేపీ కార్యకర్తలు వాజ్‌పేయిని ఆదర్శంగా తీసుకుని ఆయన అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు వడ్డేపల్లి రాంచందర్‌, కార్పొరేషన్‌ ప్రధాన కార్యదర్శు తడగొండ నర్సయ్య, పల్లికొండ నర్సింగ్‌, అధికార ప్రతినిధి మంచికట్ల బిక్షపతి, మిట్టపల్లి సతీష్‌, పెండ్యాల రవికుమార్‌, కుంభా ల రాజు, సీతకారి చంద్రశేఖర్‌, దబ్బెట కమలాకర్‌, రమేష్‌, భరత్‌, శ్రీని వాస్‌, మహేష్‌, సాయికుమార్‌ పాల్గొన్నారు. విఠల్‌నగర్‌లోని అమ్మపరివార్‌లో బీజేవైఎం జిల్లా ప్రధానకార్యదర్శి కొమ్ము శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో వాజ్‌పేయి జయంతి సందర్భంగా అనాథ పిల్లలకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గోపగోని నవీన్‌, ప్రేమ్‌కుమార్‌, మహేష్‌, అవినాష్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-26T06:04:57+05:30 IST