సీఎం కేసీఆర్‌పై ఫీల్డ్ అసిస్టెంట్లు ఫైర్

ABN , First Publish Date - 2021-10-07T19:57:00+05:30 IST

సీఎం కేసీఆర్, అధికారులపై ఫీల్డ్ అసిస్టెంట్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఎం కేసీఆర్‌పై ఫీల్డ్ అసిస్టెంట్లు ఫైర్

కరీంనగర్: సీఎం కేసీఆర్, అధికారులపై ఫీల్డ్ అసిస్టెంట్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజురాబాద్‌లో నామినేషన్ వేయకుండా అధికారులు హింసిస్తున్నారని, హుజురాబాద్ రిటర్నింగ్ అధికారి కావాలనే కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. సుప్రీంకోర్టులో కేసు వేస్తామని హెచ్చరించారు. ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా కుటుంబంతో సహా ప్రచారం చేస్తామన్నారు. కాలికి గజ్జె కట్టుకుని, డప్పు కొట్టుకుంటూ ముఖ్యమంత్రిని నిలదీస్తామన్నారు. మమ్మల్ని బలపరిచే స్థానికులను బెదిరిస్తున్నారని, అన్యాయంగా పోలీసులు కేసులు పెడుతున్నారని ఫీల్డ్ అసిస్టెంట్లు ఆవేదన వ్యక్తం చేశారు.


హుజురాబాద్ ఉపఎన్నికల్లో నామినేషన్ వేసేందుకు వచ్చిన ఫీల్డ్ అసిస్టెంట్స్‌ను అడుగడుగునా పోలీసులు, ఎన్నికల అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. నామినేషన్‌కు రెండే రోజులు గడువు ఉండటంతో భారీగా  ఫీల్డ్ అసిస్టెంట్లు హుజూరాబాద్‌కు వచ్చారు. 50 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు క్యూ లైన్‌లో ఉన్నారు. 


Updated Date - 2021-10-07T19:57:00+05:30 IST