కొనుగోళ్లు చేపట్టాలని రోడ్డెక్కిన రైతులు

ABN , First Publish Date - 2021-05-21T05:56:06+05:30 IST

ప్రభుత్వం మక్కలు కొనాలని కోరుతూ గురువారం మీర్జంపేట రైతులు మక్క కంకులతో గ్రామంలో రాస్తారోకో నిర్వహించారు.

కొనుగోళ్లు చేపట్టాలని రోడ్డెక్కిన రైతులు
మీర్జంపేటలో రాస్తారోకో చేస్తున్న రైతులు

కాల్వశ్రీరాంపూర్‌, మే 20: ప్రభుత్వం మక్కలు కొనాలని కోరుతూ గురువారం మీర్జంపేట రైతులు మక్క కంకులతో గ్రామంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత సంవత్సరం ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ మక్కలు కొనడం వల్ల రైతులకు మద్దతు ధర లభించిందన్నారు. ప్రభుత్వం ప్రస్తుతం మక్కలు కొనకపోవడంతో మధ్య దళారీలు చెప్పిన ధరకే మక్క లు విక్రయించి తీవ్రంగా నష్టపోతున్నామన్నారు. ప్రభుత్వం గత సంవత్సరం రూ.1850 కొనుగులు చేయగా ప్రస్తుత దళారీలు రూ.1200లకే మక్కలు కొంటున్నారన్నారు. ప్రభుత్వం స్పందించి మక్కలు కొనుగోలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ జనార్ధన్‌రెడ్డి, పలువురు రైతులు పాల్గొన్నారు. 

అప్పన్నపేటలో..

పెద్దపల్లి రూరల్‌, మే 20 : పెద్దపల్లి మండలంలోని గ్రా మాల్లో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి కోతలు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని గురువారం అప్పన్నపేట కొనుగోలు కేంద్రం వద్దగల రాజీవ్‌ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ధాన్యం బస్తాలను నెత్తిన ఎత్తుకొని నిరసన వ్యక్తం చేశారు. సంఘటన స్థలానికి బసంత్‌నగర్‌ ఎస్‌ఐ మహేందర్‌ చేరు కొని అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ 20రోజులుగా ధాన్యం మ్యాచర్‌ వచ్చి నా కూడా తూకం వేయకపోగా అధికారులు నిర్లక్ష్యం చేస్తు న్నారని వాపోయారు. ఇప్పటికే రెండుమార్లు అకాల వర్షం తో ధాన్యం తడిసి ముద్దయ్యాయని, అధికారుల నిర్లక్ష్యం వల్ల పూర్తిగా నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. వీటితో పాటు ఇప్పటికే బస్తాకు అదనంగా 2 కిలోల చొప్పున ధాన్యం తూకం వేస్తున్నారని. అవి కాకపో గా మరో కిలో తూకం వేస్తేనే మిల్లర్లు తీసుకుంటామని, లేకుంటే ధాన్యం తీసుకోమని బెదిరిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు చొరవ చూపి త్వరగా కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆందోళనలో పలువురు అప్ప న్నపేట గ్రామ రైతులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-21T05:56:06+05:30 IST