రైతు సంక్షేమమే ప్రభుత్వ ఎజెండా

ABN , First Publish Date - 2021-03-14T06:11:37+05:30 IST

‘రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ఎజెండా’ అని వేములవాడ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రామతీర్థపు మాధవి రాజు అన్నారు.

రైతు సంక్షేమమే ప్రభుత్వ ఎజెండా
నీటిని విడుదల చేస్తున్న చైర్‌పర్సన్‌ మాధవి

 - మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రామతీర్థపు మాధవి రాజు

వేములవాడ, మార్చి 13 : ‘రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ఎజెండా’ అని వేములవాడ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రామతీర్థపు మాధవి రాజు అన్నారు. వేములవాడ గుడి చెరువు ఆయకట్టు పరిధిలోని పొలాలకు శనివారం నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎండలు ముదురుతున్న క్రమంలో పంటలు ఎండిపోకుండా గుడి చెరువు నుంచి నీటిని విడుదల చేశామన్నారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.  ఈ  కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మధు రాజేందర్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గడ్డం హన్మాండ్లు, పట్టణ రైతు బంధు అధ్యక్షుడు లైశెట్టి మల్లేశం, కౌన్సిలర్లు మారం కుమార్‌, నిమ్మశెట్టి విజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-14T06:11:37+05:30 IST