రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ABN , First Publish Date - 2021-02-01T06:42:36+05:30 IST
రైతులకు అధ్యాయన కేంద్రాలుగా రైతు వేదికలు ఎంతో ఉపయోగపడుతాయని, దేశంలో తెలంగాణ రాష్ట్రం మోడ ల్ రాష్ట్రంగా అవతరించబోతుందని తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.

- రైతువేదిక ప్రారంభోత్సవంలో మంత్రి కొప్పుల ఈశ్వర్
పెద్దపల్లి రూరల్, జనవరి 31 : రైతులకు అధ్యాయన కేంద్రాలుగా రైతు వేదికలు ఎంతో ఉపయోగపడుతాయని, దేశంలో తెలంగాణ రాష్ట్రం మోడ ల్ రాష్ట్రంగా అవతరించబోతుందని తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఆదివారం పెద్దపల్లి మండలంలోని పాలితంలో నిర్మించిన రైతువేదికను ప్రారంభించి అనంతరం ఏర్పాటు చేసిన సమావే శంలో మంత్రి మాట్లాడారు. గత ప్రభుత్వాలు 60 ఏళ్లలో చేయని అభివృద్ధి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చి 6 ఏళ్లలో ఎంతో అభి వృద్ధి చేశారని అన్నారు. తెలంగాణలో వ్యవసాయం, సంక్షేమం, అభివృద్ధిలో ఎంతో ముందుందన్నారు. గతంలో విద్యుత్ సమస్యలు, సాగునీరు సమస్య లు ఎంతో తలెత్తాయన్నారు. 60 ఏళ్లలో రైతులకు ఎలాంటి సంక్షేమ పథకా లు అమలుచేయలేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక మొట్టమొదటగా విద్యుత్ సమస్యను జయించామన్నారు. రైతులకు సాగు నీరు అందించేందుకు భారీ ప్రాజెక్టులు నిర్మించి చివరి సాగు వరకు నీరం దించామన్నారు. తెలంగాణలో 60శాతం మది వ్యవ సాయరంగంపై ఆధారపడి ఉన్నారన్నారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర, సమస్యలు పరి ష్కార వేదికగా రైతు వేదికలు ఉపయోగపడుతాయ న్నారు. రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం రైతులు మృతిచెందితే భీమా నిమిత్తం 1500 కోట్లు చెల్లించిం దని, పంటలకు ఉచిత విద్యుత్‌ను అందించేందుకు గాను ఏడాదికి 10 వేల కోట్లు ఖర్చుచేస్తున్నామ న్నారు. తెలంగాణ ప్రభుత్వం సాగునీరు, విద్యుత్, రైతుబంధు, రైతుభీమా పథకాలు ప్రవేశపెడుతుండ టంతో పంట సాగు పెరిగిందని, దాని కోసం పంటల మార్పిడి చేయాలనే సీఎం కేసీఆర్ ఆలో చన చేసినట్లు తెలిపారు. గ్రామాల్లో కోనుగోలు కేంద్రాల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం చేతులేత్తె సిందని, గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఉండాల ని రైతులే ప్రధాని మోడీకి, బీజేపీ వాళ్లను రైతులే ప్రశ్నించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న వ్యతిరేక పద్ధతులను రైతులు ముందుకు వచ్చి ప్రశ్నించాల్సిన అవసర ముందన్నారు. తెలంగాణ రాష్ట్రం పచ్చనిహరంగా ఉండాలని గ్రామానికో నర్సరీ ఏర్పాటు చేయడంతో పాటు, విరివిగా మొక్కలు నాటామన్నారు. అలాగే రాంపల్లి, కొత్తపల్లి, బ్రాహ్మణపల్లి, చీకురాయి గ్రామాల్లో నిర్మించిన రైతు వేదికలను ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ కార్య క్రమాల్లో జడ్పీటీసీ రామ్మూర్తితోపాటు అధికారులు ఆయా గ్రామాల సర్పం చ్‌లు పాల్గొన్నారు.
వ్యవసాయ శాఖ క్యాలెండర్ ఆవిష్కరణ
వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర క్యాలెండర్‌ను మంత్రి కోప్పుల ఈశ్వర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, మండల వ్యవసాయాధికారిణి అలివేణి, ఏఈవోలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.