ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వాస్పత్రుల్లో సౌకర్యాలు

ABN , First Publish Date - 2021-11-09T06:14:09+05:30 IST

ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వాస్పత్రుల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామని ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌బాబు అన్నారు.

ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వాస్పత్రుల్లో సౌకర్యాలు
భూమిపూజ చేస్తున్న ఎమ్మెల్యే రమేష్‌బాబు

వేములవాడరూరల్‌, నవంబరు 8: ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వాస్పత్రుల్లో  మౌలిక వసతులు కల్పిస్తున్నామని  ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌బాబు అన్నారు. సోమవారం మండలంలోని నూకలమర్రిలో  హెల్త్‌ సబ్‌ సెంటర్‌ను జడ్పీచైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండల అభివృద్ధికి కట్టుబడి ఉన్నా మన్నారు. రెండు హెల్త్‌ సెంటర్‌లకు ఒక ఎంబీబీఎస్‌ డాక్టర్‌ను అందుబాటులో ఉంచుతామన్నారు. అనంతరం గ్రామంలోని పాఠశాలలో మౌలిక వసతులను పరిశీలించారు. గ్రామాల్లోని పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.2 కోట్లు కేటాయించ నున్నట్లు చెప్పారు.  మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గడ్డం హన్మాండ్లు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు గొస్కుల రవి, జడ్పీటీసీ తిరుపతి, సర్పంచ్‌ తిరుపతి, ఫ్యాక్స్‌ చైర్మన్‌ ఏనుగు తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
  ఎమ్మెల్యే కాన్వాయ్‌ అడ్డగింత..
నూకలమర్రిలో అభివృద్ధి పనుల శంకుస్థాపనకు వచ్చిన ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌ బాబు వాహనాన్ని బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. ఎన్నిక ల సందర్భంగా మండల అభివృద్ధికి ఇచ్చిన హామీలను ఎమ్మెల్యే నెరవేర్చలేక పోయారని ఆరోపించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది.

Updated Date - 2021-11-09T06:14:09+05:30 IST