రెండేళ్లుగా ఎదురుచూపులు

ABN , First Publish Date - 2021-08-27T06:14:10+05:30 IST

స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులు రెండేళ్లుగా వడ్డీ రాయితీ కోసం ఎదురుచూపులతో గ డుపుతున్నారు.

రెండేళ్లుగా ఎదురుచూపులు

- మహిళా సంఘాలకు అందని వడ్డీ డబ్బులు

- ప్రతి యేటా సుమారు రూ. కోటి బకాయిలు

- జిల్లాలో 15,048 సంఘాలకు వడ్డీ తిప్పలు

జగిత్యాల, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులు రెండేళ్లుగా వడ్డీ రాయితీ కోసం ఎదురుచూపులతో గ డుపుతున్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభు త్వం స్వయం సహాయక సంఘాలకు ప్రతీ సంవత్సరం బ్యాంకు లింకేజీ రుణాలను అందిస్తోంది. రుణాలను సకాలంలో చెల్లించిన సంఘాలకు వడ్డీ డబ్బులను ప్రభుత్వం తిరిగి వారి ఖాతాల్లో జమ చేయాల్సి ఉం టుంది. కానీ రెండేళ్లుగా వడ్డీ జమ చేయడం లేదు. దీంతో రుణాలు పొంది సకాలంలో చెల్లించిన మహిళలు వడ్డీ రాయితీ కోసం ఎదురు చూపులతో గడుపుతున్నారు. జగిత్యాల జిల్లాలో సుమారు 15,048 సం ఫూల సభ్యులకు వడ్డీ రావాల్సి ఉంది.

564 గ్రామైక్య సంఘాలు....1,78,700 మంది సభ్యులు...

జగిత్యాల జిల్లాలోని 18 మండలాల్లో గల 380 గ్రామ పంచాయతీల్లో మొత్తం 15,048 మహిళా సంఘాలున్నాయి. 564 గ్రామైక్య సంఘాలు పనిచేస్తున్నాయి. వీటిలో 1,78,700 మంది సభ్యులుగా ఉన్నారు. ఈ సం ఘాలకు ఉమ్మడి రాష్ట్రంలో పావులా వడ్డీకే రుణాలను ప్రభుత్వం అంది స్తోంది. తెలంగాణ ప్రభుత్వ పాలన ప్రారంభమైన తదుపరి నుంచి వడ్డీ లేని రుణాలను అందిస్తోంది. క్రమం తప్పకుండా రుణాలను వాయిదా ల్లో చెల్లించిన సంఘాలకు ప్రభుత్వం వడ్డీ డబ్బులను వారి ఖాతాల్లో జమ చేయాల్సి ఉంటుంది. ఏఏ సంఘాలు ఎంతెంత చెల్లించాయో వివ రాలను సంబంధిత అధికారులు సేకరించి దృవీకరిస్తారు. ఆయా సం ఘాలకు ప్రతి మూడు నెలలు, ఆరు నెలలకొకమారు బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తూ వస్తోంది. అలా వచ్చిన మొత్తాన్ని బ్యాంకులు రుణాల మొత్తం నుంచి మినహాయిస్తాయి. దీంతో సంఘాలపై వడ్డీ భా రం తగ్గుతుంది. మూడేళ్లుగా వడ్డీ డబ్బులు రాకపోవడంతో వడ్డీ లేని రుణాలు కాస్త వడ్డీ రాని రుణాలుగా మారుతున్నాయి. 

జిల్లాలో నెలకు సుమారు రూ. కోటి మాఫీ....

ప్రభుత్వం ప్రతీ నెల రూ. కోటి వరకు వడ్డీ మాఫీకి సంబంధించి డ బ్బులు చెల్లించాల్సి ఉంటుంది. 2019 మార్చి మాసం నుంచి ఆ డబ్బు ల ను అందించడం లేదు. 29 నెలలుగా సుమారు రూ. 29 కోట్లు మహి ళా సంఘాలకు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. ప్రభుత్వం వారికి వడ్డీ డబ్బు జమచేయకపోవడంతో అదనపు భారం పడుతోందని మహిళలు ఆవేదనకు గురవుతున్నారు. 

ప్రతీ నెల బకాయిలు...

జగిత్యాల జిల్లాలో రుణాలు పొందిన మహిళా సంఘాలకు ప్రతీ నెల వడ్డీ చెల్లింపును అధికారులు లెక్కిస్తారు. జిల్లాలో గల ఆయా సంఘాల కు రావాల్సిన వడ్డీ బకాయిలను ప్రభుత్వానికి అందజేస్తుంటారు. ఇందు లో జిల్లాలోని వెల్గటూరు మండలంలో 670 సంఘాలకు రూ. 7.57 లక్ష లు, సారంగపూర్‌లో 283 సంఘాలకు రూ. 2.29 లక్షలు, రాయికల్‌లో 633 సంఘాలకు రూ. 6.55 లక్షలు, పెగడపల్లిలో 515 సంఘాలు రూ. 5.28 లక్షలు, మెట్‌పల్లిలో 565 సంఘాలకు రూ. 7.40 లక్షలు, మేడిప ల్లిలో 625 సంఘాలకు రూ. 7.32 లక్షలు ప్రతీనెల వడ్డీ మాఫీ రావాల్సి ఉంది. అదేవిధంగా మల్యాలలో 369 సంఘాలకు రూ. 3.26 లక్షలు, మ ల్లాపూర్‌లో 573 సంఘాలకు రూ. 7.38 లక్షలు, కోరుట్లలో 513 సంఘా లకు రూ. 5.75 లక్షలు, కొడిమ్యాలలో 621 సంఘాలకు రూ. 8.96 లక్ష లు, కథలాపూర్‌లో 604 సంఘాలకు రూ. 6.03 లక్షలు, జగిత్యాలలో 126 సంఘాలకు రూ. 1.38 లక్షలలు, జగిత్యాల రూరల్‌లో 580 సంఘా లకు రూ. 5.14 లక్షలు, ఇబ్రహీంపట్నంలో 353 సంఘాలకు రూ. 3.44ల క్షలు, గొల్లపల్లిలో 581 సంఘాలకు రూ. 6.49 లక్షలు, ధర్మపురిలో 448 సంఘాలకు రూ. 4.54 లక్షలు, బుగ్గారంలో 235 సంఘాలకు రూ. 2.20 లక్షలు, బీర్‌పూర్‌లో 223 సంఘాలకు రూ. 1.59 లక్షల వడ్డీ మాఫీ డబ్బు లు ప్రతీ నెల రావాల్సి ఉంది. 

వడ్డీ మాఫీ అందడం లేదు

- జోగినిపల్లి సరిత, అధ్యక్షురాలు, ఆదర్శ స్వయం సహాయక మహిళా సంఘం, బుగ్గారం

బ్యాంకులో తీసుకున్న అప్పుకు సంబంధించి సకాలంలో వాయిదాలను చెల్లిస్తున్నాము. అసలుతో పాటు వడ్డీని కూడా కడుతున్నాము. గతంలో వెంటనే వడ్డీ మాఫీ డబ్బులు జమ చేసేవారు. ప్రస్తుతం సుమారు రెం డున్నరేళ్లుగా వడ్డీ డబ్బులు రావడం లేదు. సాధ్యమైనంత తొందరగా ప్ర భుత్వం వడ్డీ మాఫీని బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలి.


నిధులు రావాల్సి ఉంది

- వనజ, బ్యాంకు లింకేజీ డిస్ట్రిక్ట్‌ ప్రాజెక్టు మేనేజర్‌, జగిత్యాల

స్వయం సహాయక సంఘాల మహిళల రుణాలకు సంబందించివడ్డీ మాఫీ డబ్బులు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. 2018-19 ఆర్థిక సం వత్సరంలో మార్చి మాసం వరకు వడ్డీ మాఫీ జమ చేశారు. 2019 ఏప్రి ల్‌ మాసం నుంచి మహిళా సంఘాలకు వడ్డీ మాఫీ నిధులు రావాల్సి ఉంది. ప్రభుత్వం వడ్డీ మాఫీ నిధులను ఎప్పుడు విడుదల చేస్తే అప్పు డు వెంటనే ఆయా మహిళా సంఘాల ఖాతాల్లో జమ చేస్తాము.

Updated Date - 2021-08-27T06:14:10+05:30 IST