ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

ABN , First Publish Date - 2021-11-10T05:03:30+05:30 IST

చట్టాలపై అవగాహన పెం చుకోవాలని న్యాయవాది బందెల రమేష్‌ పేర్కొన్నారు.

ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
పాతగూడూర్‌లో మాట్లాడుతున్న న్యాయవాది రమేష్‌

వెల్గటూర్‌, నవంబరు 9: చట్టాలపై అవగాహన పెం చుకోవాలని న్యాయవాది బందెల రమేష్‌ పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని పాతగూడూర్‌ గ్రామంలో ఆజాదికా అమృత్‌ మహోత్సవ్‌, చట్టాలపై అవగాహన కా ర్యక్రమంలో భాగంగా మండల లీగల్‌ సెల్‌ అథారిటీ ఆ ధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ప్రా మిసరీ నోట్లు, లిమిటేషన్‌, వినియోగదారుల హక్కులు, మహిళ చట్టాల గురించి వివరించారు. న్యాయవాదుదు జితేంధర్‌రెడ్డి, అలుక వినోద్‌ కుమార్‌, దుర్గ్గయ్య, సర్పంచ్‌ జగదీ శ్వర్‌రెడ్డి, పాల్గొన్నారు.

మల్లాపూర్‌ : చట్టాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్గి ఉండాలని మెట్‌పల్లి జూనియర్‌ సివిల్‌ జడ్జి పద్మావతి అ న్నారు. మంగళవారం మండల కేంద్రంలో ప్రపంచ న్యా య సేవా దినోత్సవం సందర్భంగా గ్రామస్థులకు చట్టాల పై అవగాహనా సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహ సీల్దార్‌ రవీందర్‌, మెట్‌పల్లి బార్‌ అసోసియేషన్‌ అద్యక్షుడు ఎండీ వలీయోద్దీన్‌, కార్యదర్శి ఆనంద్‌, ఎజీపీ సురక్ష, న్యాయవాదులు రాంరెడ్డి, వెంకట నర్సయ్య, దయాకర్‌వర్మ పాల్గొన్నారు.

కథలాపూర్‌ : చట్టాలపై ప్రతి ఒక్కరూ కలిగి ఉండా ల ని కోరుట్ల బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కడకుంట్ల స దాశివరాజు, మండల ఇన్‌చార్జి సురభి అశోక్‌ పేర్కొన్నా రు. మంగళవారం మండలంలోని ఇప్పపల్లి, కలికోట, సిరి కొండ పాఠశాలల్లో న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వ హిం చారు. సర్పంచులు వసంత నరేంధర్‌రెడ్డి, దరావత్‌ సరోజ సీతారాం, వీణస్వామి, హెచ్‌ఎం లక్ష్మీనర్సయ్య, అసోసి యేషన్‌ కార్యదర్శి విజయ్‌కుమార్‌, సురేశ్‌, శ్రీనివాస్‌,  ఉన్నారు. 

మల్యాల  : ప్రతి ఒక్కరూ న్యాయ సేవలపై అవగాహ న కలిగి ఉండాలని జగిత్యాల న్యాయవాదులు రాంచం ద్రం, లక్ష్మనారాయణ, కరభూజ నర్సయ్యగౌడ్‌ పేర్కొన్నా రు. మండలంలోని ముత్యంపేట గ్రామంలో మంగళవా రం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. సర్పంచ్‌ తి రుపతిరెడ్డి, ఉపసర్పంచ్‌ త్రినాథ్‌, పంచాయితీ కార్యదర్శి స్వప్న గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ఇబ్రహీంపట్నం : చట్టాలపై ప్రతి ఒక్కరు అవగహన కల్గి ఉండాలని న్యాయవాది రమేష్‌ అన్నారు. మంగళవా రం మండలంలోని బర్తీపూర్‌ గ్రామంలో న్యాయ విజ్ఙాన సదస్సు నిర్వహించారు. ప్రతి ఒక్కరు చట్టాల గురించి తె లుసుకోవాలన్నారు. సర్పంచ్‌ సాగర్‌, కమిటీ సభ్యులు న్యా యవాదులు రమేష్‌, పద్మ పాల్గొన్నారు.

Updated Date - 2021-11-10T05:03:30+05:30 IST