అందరూ కొవిడ్‌ నిబంధనలు పాటించాలి

ABN , First Publish Date - 2021-03-14T05:58:34+05:30 IST

అందరూ కొవిడ్‌ నిబంధనలు పాటించాలని ఎన్‌వీబీడీసీపీ (నేషనల్‌ వేక్టర్‌ బార్న్‌ డిసీజ్‌ కంట్రోల్‌ ప్రోగ్రాం) అడిషనల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ అమర్‌సింగ్‌ నాయక్‌ సూచించారు.

అందరూ కొవిడ్‌ నిబంధనలు పాటించాలి
వ్యాక్సినేషన్‌ వివరాలు తెలుసుకుంటున్న ఎన్‌వీబీడీసీపీ అడిషనల్‌ డైరెక్టర్‌ అమర్‌సింగ్‌ నాయక్‌

-ఎన్‌వీబీడీసీపీ అడిషనల్‌ డైరెక్టర్‌ అమర్‌సింగ్‌ నాయక్‌
సుభాష్‌నగర్‌, మార్చి13: అందరూ కొవిడ్‌ నిబంధనలు పాటించాలని ఎన్‌వీబీడీసీపీ (నేషనల్‌ వేక్టర్‌ బార్న్‌ డిసీజ్‌ కంట్రోల్‌ ప్రోగ్రాం) అడిషనల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ అమర్‌సింగ్‌ నాయక్‌ సూచించారు. కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించడంతోనే పక్క రాష్ర్టాల్లో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయని ఆయన అన్నారు. శనివారం జిల్లా ఆసుపత్రితో పాటు కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రాలను జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ సుజాతతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్‌వీబీడీసీపీ అడిషనల్‌ డైరెక్టర్‌ మాట్లాడుతూ  ప్రజలు భౌతికదూరం పాటిస్తూ విధిగా మాస్కులు ధరించాలని సూచించారు. తరచూ చేతులను శానిటైజ్‌ చేసుకోవాలని, ప్రయాణాలు చేస్తున్నప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలలకు వెళ్తున్న విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు. అనంతరం డీఎంహెచ్‌వో సుజాత మాట్లాడుతూ తలనొప్పి, ఒంటి నొప్పులు, జ్వరం, దగ్గు వంటి లక్షణాలు ఉన్నవారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సమీపంలోని ఆసుపత్రుల్లో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని కోరారు.

Updated Date - 2021-03-14T05:58:34+05:30 IST