బీసీ హాస్టల్‌లో ఐసోలేషన్‌ కేంద్రం ఏర్పాటు

ABN , First Publish Date - 2021-05-02T05:51:39+05:30 IST

గోదావరిఖని సప్తగిరికాలనీలోని బీసీ సోషల్‌ రెసిడెన్సియల్‌ హాస్టల్‌లో 25పడకల కూడిన ఐసోలేషన్‌ కేంద్రాన్ని శనివారం ఏర్పాటు చేశారు.

బీసీ హాస్టల్‌లో ఐసోలేషన్‌ కేంద్రం ఏర్పాటు
ఐసోలేషన్‌ కేంద్రాన్ని పరిశీలిస్తున్న డీఎంహెచ్‌ఓ, తహసీల్దార్‌

కళ్యాణ్‌నగర్‌, మే 1: గోదావరిఖని సప్తగిరికాలనీలోని బీసీ సోషల్‌ రెసిడెన్సియల్‌ హాస్టల్‌లో 25పడకల కూడిన ఐసోలేషన్‌ కేంద్రాన్ని శనివారం ఏర్పాటు చేశారు. ఈ ఐసోలేషన్‌ సెంటర్‌ను డీఎంహెచ్‌ఓ ప్రమోద్‌కుమార్‌, రామగుండం తహసీల్దార్‌ కత్రోజు రమేష్‌ పరిశీలించారు. గత నెల 23న గోదావరిఖని ప్రభుత్వాసుపత్రిని సందర్శించడానికి వచ్చిన కలెక్టర్‌ సంగీత సత్యనారాయణ మరో 50పడ కల ఐసోలేషన్‌  సెంటర్‌ను ఏర్పాటు చేయాలని డీఎంహెచ్‌ఓకు సూచించడంతో పాటు నిధులను కూడా మంజూరు చేశారు. ఈ ఐసోలేషన్‌ సెంటర్‌లో ప్రస్తుతానికి 25 పడకలను ఏర్పాటు చేయగా రోగు ల సంఖ్యను బట్టి 100 పడకలకు పెంచనున్నారు. ఆసుపత్రిలోనే రోగులకు చికిత్సతో పాటు భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు డీఎం హెచ్‌ఓ ప్రమోద్‌ కుమార్‌ తెలిపారు. 

Updated Date - 2021-05-02T05:51:39+05:30 IST