పిల్లల సంరక్షణ కోసం హెల్ప్‌లైన్ ఏర్పాటు
ABN , First Publish Date - 2021-05-06T05:52:25+05:30 IST
కరోనా సోకిన తల్లి దండ్రుల పిల్లల సంరక్షణ కోసం ప్రభు త్వం ప్రత్యేక హెల్ఫ్‌లైన్ ఏర్పాటు చేసిందని కలెక్ట ర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ తెలిపారు.
- కలెక్టర్ సంగీత సత్యనారాయణ
పెద్దపల్లి టౌన్, మే 5: కరోనా సోకిన తల్లి దండ్రుల పిల్లల సంరక్షణ కోసం ప్రభు త్వం ప్రత్యేక హెల్ఫ్‌లైన్ ఏర్పాటు చేసిందని కలెక్ట ర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ తెలిపారు. తన కార్యాలయంలో బుధవారం మహిళా శిశు సంక్షేమ అధికారులతో సమీక్షా సమావే శం నిర్వహించిన అనంతరం కలెక్టర్ మాట్లా డారు. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లల సంరక్షణ కోసం 040-23733665 సం ప్రదించాలన్నారు. అలాగే 1098 పిల్లల ఆదర ణ కోసం అందుబాటులో ఉంటుందన్నారు. తల్లిదండ్రులు క్వారంటైన్ లేదా ఆస్పత్రుల్లో ఉంటే వారి పిల్లలపై ప్రత్యేక శద్ధ తీసుకుంటారని ఆమె వివరించారు. ఆమ వెంట మహిళా శిశు సంక్షేమ అధికారి లక్ష్మీరాజం తదితరులున్నారు.