జిల్లా కోర్టును సుల్తానాబాద్‌లో ఏర్పాటు చేయండి

ABN , First Publish Date - 2021-06-21T06:22:19+05:30 IST

జిల్లా కోర్టును అందరికీ ఆమోదయోగ్యంగా, అందుబాటులో ఉండే సుల్తానాబాద్‌లో ఏర్పాటు చేయాలని బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వొడ్నాల రవీందర్‌ తదితరులు డిమాండ్‌ చేశారు.

జిల్లా కోర్టును సుల్తానాబాద్‌లో ఏర్పాటు చేయండి
వినతిపత్రం అందిస్తున్న బార్‌ అధ్యక్షుడు రవీందర్‌ తదితరులు

సుల్తానాబాద్‌, జూన్‌ 20: జిల్లా కోర్టును అందరికీ ఆమోదయోగ్యంగా, అందుబాటులో ఉండే సుల్తానాబాద్‌లో ఏర్పాటు చేయాలని బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వొడ్నాల రవీందర్‌ తదితరులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఒక వినతిపత్రంను ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావుకు అందజేశారు. ఆదివారం సుల్తానాబాద్‌లో వారు విలేకరులతో మాట్లాడుతూ బార్‌ అసోసియోషన్‌ తరపున కరీంనగర్‌లో నిర్వహించిన న్యాయవాదులకు హెల్త్‌ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొ న్నామని తెలిపారు. ఇదే సందర్భంలో తాము ఒక వినతిపత్రంను అందించా మని వివరించారు. సుల్తానాబాద్‌ కోర్టు ప్రాంగణం విశాలంగా ఉందని ఇది జిల్లా కోర్టుల ఏర్పాటుకు అను కూలంగా ఉంటుందని ఈ అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసకెళ్లి పరిశీలించా లని తాము ఎమ్మెల్సీని కోరామన్నారు. ఈ కార్యక్రమంలో బార్‌ ఉపాధ్య క్షులు జోగుల రమేష్‌, కోశాదికారి సామల రాజేంద్ర ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-21T06:22:19+05:30 IST